HomeAndhra PradeshYSRCP Candidates: గెలుపే లక్ష్యం.. వైయస్సార్‌సీపీ సమన్వయకర్తల రెండో లిస్టు ఇదీ..!

YSRCP Candidates: గెలుపే లక్ష్యం.. వైయస్సార్‌సీపీ సమన్వయకర్తల రెండో లిస్టు ఇదీ..!

YSRCP Candidates: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైయస్సార్‌సీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది ఇన్‌చార్జులను మార్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా సెకండ్‌ లిస్టు కోసం ఎదురు చూపులు తప్పలేదు. తాజాగా ఇవాళ రెండో లిస్టును పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. (YSRCP Candidates)

గెలుపే ప్రామాణికంగా రెండో జాబితా రూపకల్పన చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. 27 మందితో జాబితాను వైయస్సార్‌సీపీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన చేసినట్లు స్పష్టమవుతోంది. అంతకు ముందు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి కీలక నేతలు క్యూకట్టారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు సీఎంతోచర్చలు జరిపారు. వైసీపీ ఇంచార్జి మార్పుల రెండవ జాబితాపై సీఎంతో సుదీర్ఘంగా మాట్లాడారు.

వైయస్సార్‌సీపీ నూతన ఇన్‌చార్జులు నియోజకవర్గాలు ఇవీ..

* జోలదరాశి శాంత – హిందూపురం (ఎంపీ)
* మాలగుండ్ల శంకర నారాయణ – అనంతపురం (ఎంపీ)
* గుమ్మనూరు జయరాం – కర్నూలు (ఎంపీ)
* కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి – అరకు (ఎంపీ)

* మత్స్యరాస విశ్వేశ్వరరాజు – పాడేరు (ఎస్టీ)
* గొడ్డేటి మాధవి – అరకు (ఎస్టీ)
* తాటిపర్తి చంద్రశేఖర్ – ఎర్రగొండపాలెం (ఎస్సీ)
* డా. తాలె రాజేష్ – రాజాం (ఎస్సీ)

* బీఎస్ మక్బూల్ అహ్మద్ – కదిరి
* పిల్లి సూర్యప్రకాశ్ – రామచంద్రాపురం
* మాచాని వెంకటేష్ – ఎమ్మిగనూరు
* భూమన అభినయ్ రెడ్డి – తిరుపతి

* షేక్ నూరి ఫాతిమా – గుంటూరు ఈస్ట్
* పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) – మచిలీపట్నం
* విజయానంద రెడ్డి – చిత్తూరు
* చెవిరెడ్డి మోహిత్ రెడ్డి – చంద్రగిరి

* కేవీ ఉషశ్రీ చరణ్ – పెనుకొండ
* తలారి రంగయ్య – కళ్యాణ దుర్గం
* వెల్లంపల్లి శ్రీనివాసరావు – విజయవాడ సెంట్రల్
* షేక్ ఆసిఫ్ – విజయవాడ వెస్ట్

* మార్గాని భరత్ – రాజమండ్రి సిటీ
* చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ – రాజమండ్రి రూరల్
* మలసాల భరత్ కుమార్ – అనకాపల్లి
* కంబాల జోగులు – పాయకరావు పేట (ఎస్సీ)

* విప్పర్తి వేణుగోపాల్ – పి.గన్నవరం (ఎస్సీ)
* వంగా గీత – పిఠాపురం
* తోట నరసింహం – జగ్గంపేట
* వరుపుల సుబ్బారావు – ప్రత్తిపాడు
* తెల్లం రాజ్యలక్ష్మి – పోలవరం (ఎస్టీ)

Read Also : YSRCP Candidates change: తెలంగాణ ఫలితాలతో జగన్‌ అలర్ట్‌.. 11 స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. మొత్తం 82 మార్పులు ఖాయమా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు