Janasena Meeting Mangalagiri: జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో మళ్లీ యాక్టివ్‌అయ్యారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించిన ఆయన.. ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. (Janasena Meeting Mangalagiri)
* జనసేనకు యువతే పెద్ద బలం
* మన పార్టీకి యువత బలం చూసి భాజపా పెద్దలే ఆశ్చర్యపోయారు
* ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది
* ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు
* పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు
* నన్ను, నా భావజాలన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు
* యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం
* నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా
* కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది
* భావజాలం ఏమీ లేని పార్టీ.. వైసీపీ
* సమాజాన్ని ఎలా చూస్తామనే దాని పై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది
* తెలంగాణ నగర ప్రాంతాల్లో ఓటింగ్ కు యువత దూరంగా ఉన్నారు
* నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు
* నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నా
* స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా
* చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది
* కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదు
* సినిమాలు ఆపేసినా, హోటల్ కు వచ్చి బెదిరించినా ఎవరినీ కలవలేదు
* స్థానికకక సంస్థల ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పనిచేశాయి
* వైసీపీని తట్టుకునేందుకే కలిసి పనిచేస్తున్నామని వాళ్లు చెప్పారు
* మెగాస్టార్, సూపర్ స్టార్‌ను కూడా వీళ్లు బెదిరిస్తారు
* అవమానం జరిగినా, దెబ్బపడినా మరిచిపోను
* విభజన సమయంలో ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదు
* రాష్ట్రానికి ఏం ఇస్తే లాభమో ఏ నెతలూ ఆలోచించలేదు
* ఒక కులం మీద రాజకీయాలు నడపలేం.. సాధ్యం కాదు
* వైసీపీ నేతలు వేసే కులాల ఉచ్చులో చిక్కోవద్దని కోరుతున్నా
* ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం
* పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు
* ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా
* మాకు ప్రజలు ముఖ్యం.. నాయకులు కాదు..
* తలదించుకునే పరిస్థితిలో ఎప్పుడూ ఏపీ ఉండకూడదు
* అనివార్య పరిస్థితుల్లోనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం
* ఆరోజుల్లో పార్టీని నడపలేకపోయాం.. నిలబడలేకపోయాం
* ఇప్పుడు మాత్రం ప్రాణం పోయేవరకు నిలబడతాం
* జగన్.. మహానుభావుడు కాదు.. ప్రజా కంటకుడు
* మనపార్టీ నుంచి వెళ్లిపోయినవారు తిట్టినా పట్టించుకోను
* రేపు టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే వీరంతా ఏం చేస్తారు
* మమ్మల్ని విమర్శించేందుకు ఈ విషయం గుర్తించుకుని మాట్లలాడాలి
* డబ్బు లేకున్నా పట్టుదలగా పదేళ్లపాటు పార్టీని నడిపాం
* మనం తెదేపా వెనుక నడవడం లేదు.. కలిసి నడుస్తున్నాం
* షణ్ముఖ వ్యూహంలో చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం
* ఏ మతం వారినైనా సనాతన ధర్మం స్వీకరిస్తుంది.. కలుపుకుంటుంది
* ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తే ఎవరినైనా గౌరవిస్తాం
* మనం ఎన్ని మాట్లాడుకున్నా పోలింగ్ రోజు అనేది చాలా కీలకం.
ఇదీ చదవండి: Chandrababu meeting: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
