HomeAndhra PradeshAdudham Andhra: ఆడుదాం ఆంధ్ర వీడియో లాంచ్.. బ్రోచర్ ఆవిష్కరణ

Adudham Andhra: ఆడుదాం ఆంధ్ర వీడియో లాంచ్.. బ్రోచర్ ఆవిష్కరణ

Adudham Andhra: క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా వీడియో లాంచ్‌ చేశారు మంత్రి ఆర్కే రోజా. బ్రోచర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో 51 రోజుల పాటు క్రీడా సంబరం సాగనుంది. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు టోర్నమెంట్ జరగనుంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడల్లో పోటీలు ఉంటాయి. (Adudham Andhra)

క్రీడామంత్రిగా నా జీవితంలో ఇదొక సంతోషకరమైన రోజు అని రోజా అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలేదని మంత్రి రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా.. యువతకు మంచి అవకాశమన్నారు. ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనే క్రీడాకారుల కోసం రూ.12 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తున్నామన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

క్రీడల పట్ల ఆసక్తి, యువత పై నమ్మకం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. కోటి మంది వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో క్రీడలను పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు.

ఏపీలో సీఎం జగన్ ఒక ట్రెండ్ ను సృష్టించారు : శాప్ ఛైర్మన్ సిద్ధార్ధ్ రెడ్డి

తమ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుంచి ప్రతి నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా సీఎం జగన్‌ చూశారని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద క్రీడా సంబరం అన్నారు. గ్రామీణస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని వివరించారు. ఆడుదాం ఆంధ్రాను యువత వినియోగించుకోవాలన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు సీఎం జగన్ బహుమతులు అందజేస్తారన్నారు.

Read Also : Bhatti Vikramarka: ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారు : భట్టి విక్రమార్క

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు