Minister Meruga Nagarjuna: సంక్షేమ కార్యక్రమాలపై పచ్చ మీడియా మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకుందా? అని నిలదీశారు. తాడేపల్లిలో నిన్న మీడియాతో మాట్లాడిన మేరుగ.. పలు అంశాలపై పచ్చ మీడియా తీరును ప్రస్తావించారు. (Minister Meruga Nagarjuna)
* సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి ఆలోచించారు
* సామాజిక విప్లవానికి తెరతీసిన నాయకుడు వైఎస్ జగన్
* చంద్రబాబును జాకీలతో లేపాలన్నదే రామోజీరావు తాపత్రయం
* రామోజీ దొంగరాతలు ఎవరూ నమ్మరు
* ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు
* రాష్ట్రంలో ఎవరు పేదలకు మంచి చేశారన్నది ప్రజలకు తెలుసు
* వెనుకబడిన వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
* దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలనుకున్న నేత జగన్
* అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కాలనుకున్నది చంద్రబాబే కదా
* అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్
* విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తున్నది ఎవరు?
* ఏరోజైనా అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు కనీసం గౌరవించారా?
* ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూసిన వ్యక్తి చంద్రబాబు
* ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెరతీశారు
* బాబు హయాంలో 2 వేల స్కూళ్లని మూసివేసి పేద పిల్లల జీవితాలను నాశనం చేశారు
* కార్పొరేట్ స్కూళ్లకి పోటీగా సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లని అభివృద్ధి చేశారు
* చంద్రబాబు హయాంలో విదేశీ విద్య పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
* దీని పై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది
* సీఎం జగన్ చేసిన మంచిపనులు రామోజీరావుకి కనపడటం లేదు
* రామోజీ రాతలను జనం నమ్మే పరిస్థితి లేదు
* చంద్రబాబుకు దళిత క్రైస్తవులు ఏనాడైనా కనిపించారా?
* రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు కోర్టుకు వెళ్తే రామోజీరావు ఎందుకు రాయలేదు?
* ఇంగ్లీషు మీడియం పేదలకు అవసరం లేదని బాబు కోర్టుకు వెళ్తే మీ పత్రికలో ఎందుకు రాయలేదు?
* దళితుడి పై దాడిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని చంద్రబాబు హయాంలో తేలితే ఎందుకు రాయలేదు?
* గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు
* పోడు భూములకు పట్టాలిచ్చి భరోసా కల్పిస్తే ఎందుకు రాయలేదు?
* గిరిజన యూనివర్సిటీ మేము నిర్మిస్తుంటే ఎందుకు రాయలేదు?
* దీని పై మేము చర్చకు సిద్ధమే….టీడీపీ నేతలు, రామోజీరావు చర్చకు వస్తారా?
Read Also : Adudham Andhra: ఆడుదాం ఆంధ్ర వీడియో లాంచ్.. బ్రోచర్ ఆవిష్కరణ
