Hathiram Math: తిరుపతి హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా ఉన్న అర్జున్ దాస్‌ను తొలిగిస్తూ ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మఠానికి చెందిన అన్ని రకాల ఆస్తులను తాత్కాలికంగా నియమించిన ఫిట్ పర్సన్ అయిన రమేష్ నాయుడుకి అప్పగించాల్సిందిగా ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు నిన్న జరిగిన రాష్ట్ర ధార్మిక పరిషత్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. (Hathiram Math)
హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా పనిచేసిన అర్జున్ దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు త్రిసభ్య కమిటీ విచారణలో స్పష్టమైందని, ఆయనపై మోపిన 16 అభియోగాలకు వివరణ ఇవ్వాల్సినదిగా నోటీసు కూడా జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 16 న జరిగిన ధార్మిక పరిషత్ సమావేశానికి అర్జున దాస్ ఇద్దరు ప్లీడర్లతో హాజరై అభియోగాలపై సరైన వివరణ ఇవ్వకుండా తనను మహంతుగా కొనసాగించాలని కోరాడన్నారు. ఈ విషయంపై ధార్మిక పరిషత్ సమావేశంలో సమగ్రంగా చర్చించి అతనిని మహంతుగా తొలగించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వివరించారు.
* ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 59 మంది గ్రేడ్-3 ఈవోల్లో 54 మందికి నియామక పత్రాలను జారీ చేశామని మంత్రి వెల్లడించారు.
* మిగిలిన వారు హాజరు కాకపోవడం వల్ల వారికి నియామక పత్రాలను జారీ చేయలేదన్నారు.
* సీఎం జగన్ ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పలు దేవాలయాల పునరుద్దరణకు, నూతన దేవాలయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
* గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 815 దేవాలయాల నిర్మాణం, పునరుద్దరణకు రూ.539 కోట్ల సీజీఎఫ్ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
* గతంలో కేవలం 1,621 దేవాలయాలకే పరిమితం అయిన దూపదీప నైవేధ్యం పథకం (డి.డి.ఎన్.ఎస్.) నేడు దాదాపు 8 వేల దేవాలయాల వరకూ విస్తరించడం జరుగుతోందన్నారు.
* శ్రీవాణి ట్రస్టు క్రింద చేపట్టిన 2,872 దేవాలయాల్లో 371 పూర్తి చేయడం జరిగిందని, 1,015 ప్రగతిలో నున్నాయన్నారు.
* సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 3,208 మంది అర్చకుల గౌరవ వేతనాన్ని పెంచామన్నారు.
* రూ.5 వేల లోపు గౌరవ వేతనం పొందే 1,683 మంది అర్చకులకు రూ.10 వేలకు, రూ.10 వేల లోపు గౌరవ వేతనం పొందే 1,525 మంది అర్చకులకు రూ.15,625/- లకు పెంచడం జరిగిందన్నారు.
* రాష్ట్రంలోని మొత్తం 3,208 మంది అర్చకులకు ప్రతి నెలా రూ.3.87 కోట్లను గౌరవ వేతనంగా చెల్లిస్తున్నామన్నారు.
Read Also : Endowment Outsourcing Jobs: దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్‌పై ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ

[…] […]