HomeAndhra PradeshCM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్‌

CM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్‌

CM Jagan relesed ONGC Compensation: ఓఎన్‌జీసీ సంస్ధ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకార కుటుంబాలను ఆదుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. నిన్న క్యాంప్‌ కార్యాలయంలో ఈ మేరకు వర్చువల్‌గా ఆర్ధిక సాయాన్ని విడుదల చేశారు. వాస్తవానికి సూళ్లూరుపేటలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా సీఎం టూర్‌ రద్దు చేసుకున్నారు. నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. (CM Jagan relesed ONGC Compensation)

* ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం.
* వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నాం.
* మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
* తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం.
* ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతాం.

* ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం.
* నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడాం.
* వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం.
* 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది.

* నాలుగో విడతలో రూ.161 కోట్లు కలుపుకుంటే రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం, ఇప్పించగలిగాం.
* ఇంతకుముందు 2012లో జీఎస్‌పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేసి నష్టపోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది.
* కోనసీమ జిల్లా ముమ్మడివరంలో రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి.

* మనకన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలో చన చేయలేదు.
* మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ మనం ఇచ్చేసి తర్వాత ఈ డబ్బును కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వెనక్కు ఇప్పించుకోగలిగాం.
* ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. మంచి చేయాలనే తపన ఉంటే దేవుడి సహకారం ఉంటుంది.

* ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ.
* 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే ఆదుకోవాలని తపన పడ్డాం.
* ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

* ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం.
* ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యాకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది.
* ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

Read Also : CM Jagan Meeting with Officials: విశాఖపట్నం వయా ఉమ్మడి కర్నూలు మీదుగా కడపకు హైస్పీడ్‌ రైళ్ల కోసం ఒత్తిడి తీసుకురావాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు