HomeAndhra PradeshAP Banking Good: ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

AP Banking Good: ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

AP Banking Good: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశం నిన్న అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. (AP Banking Good)

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ మెచ్చుకున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎమ్ఎస్ఎమ్ఈలకు రుణాలను విరివిగా ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లకు విజ్ణప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా సంబంధిత పథకాలకు రుణాలపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలన్నారు.

ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మ నిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చే పథకానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని బుగ్గన బ్యాంకర్లకు విజ్ణప్తి చేశారు. ఆయా పధకాల అమలులో ఎక్కువ జాప్యం జరగకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా – ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి వాటితో సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అందరికీ రుణసదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు.

జూన్ ఆఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.కౌలు రైతులకు సాయమందించడంలో వ్యవసాయ శాఖతో అనుసంధానమై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు బ్యాంకర్ల నుంచి మరింత సహకారం కావాలన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సీఐబీఐఎల్ (సిబిల్) స్కోర్, వయస్సు వగైరా కారణాలతో ఎక్కువగా దరఖాస్తులు పక్కనపెడుతున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలన్నారు.

సెర్ప్ కి సంబంధించిన ఎస్.హెచ్.జీ బ్యాంక్ లింకేజీల ద్వారా ఇప్పటి వరకూ రూ.4,286 కోట్లు మాత్రమే రుణాలిచ్చినట్లు మంత్రి చెప్పారు. దీనిపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.రూ.3 లక్షల వరకూ డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీని తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ణప్తి చేశారు. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇచ్చే రుణ పథకాలైన వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు,పావలా వడ్డీ కార్యక్రమాల్లో పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 38 శాతం లక్ష్యాలను అధికమించడం పట్ల బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకున్న దృష్ట్యా రైతాంగానికి మరిన్ని రుణాలు అందించడం ద్వారా వారికి పూర్తి స్థాయిలో చేయూతనందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగనన్న పాలవెల్లువ పథకంలో తగిన తోడ్పాటును ఇవ్వాలని కోరారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు కూడా పెద్దఎత్తున రుణ సౌకర్యం కల్పించాలని విజ్ణప్తి చేశారు.

ఇదీ చదవండి: YSRCP Bus Yatra: సామాజిక ధర్మాన్ని పాటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌: బస్సు యాత్రలో నేతలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు