YSRCP Bus Yatra: సామాజిక ధర్మాన్ని పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్సార్‌సీపీ నేతలు ఉద్ఘాటించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు జగనన్న అందిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార యాత్ర నాలుగో రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. (YSRCP Bus Yatra)
దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ..
* దెందులూరు కోట వైయస్సార్‌సీపీ అడ్డాగా ఉంటుంది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఓసీల్లోని నా నిరుపేదలని చెప్పే జగనన్న మాటలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం.
* చంద్రబాబు, పవన్, మోదీ ఫొటోలతో మేనిఫెస్టో ఇచ్చి ఏదీ అమలు చేయలేదు. మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
* చంద్రబాబు 2014లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేశాడా? సెంటు భూమీ కొనలేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నాడు. లోకేష్‌కు తప్ప ఇంకెవరికన్నా ఇచ్చారా? మన మేనిఫెస్టో చూస్తే ఎన్నికల వరకు అక్కచెల్లెమ్మలకు రుణం నాలుగు విడతల్లో మాఫీ చేశాం.
* మన నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్లు ఇచ్చిన జగనన్న. నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్ల అభివృద్ధి, సంక్షేమం.
* రోడ్లు, ఇళ్ల స్థలాలు, అభివృద్ధి, సంక్షేమం, బడులు, హాస్పిటళ్లు.. ఏ విషయంలో అయినా మాజీ శాసనసభ్యుడు నాతో పోటీకి వస్తాడా? 50 వేల మెజార్టీతో దెందులూరులో వైయస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాం.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ..
* జగనన్న మీటింగ్‌లో లేడు. ఆయన కటౌట్ మాత్రమే ఉంది. 175 నియోజకవర్గాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి జగనన్నకు అండగా ఉంటాం. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సామాజిక సాధికారత ధర్మాన్ని జగనన్న సాధించాడు.
* 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చింది మన జగనన్న.
* జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేడ్కర్, భగత్‌సింగ్ పోరాట పటిమ కలిస్తే జగన్‌మోహన్‌రెడ్డి గారు.
* జగనన్నను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. అందరం జగనన్న వెంట నడవాలి.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..
* అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి, బాబూజగ్జీవన్ రామ్, సామాజికంగా వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమ ఫలితం జగన్‌మోహన్‌రెడ్డిగారు తీరుస్తున్నారు.
* చంద్రబాబు పాలనలో అసమానతలు, అవహేళనలు, దళితులపై దాడులు చూశాం. – దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాటలు చూశాం.
* రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం రూ.2.35 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగనన్న.
* పేద వాడు గుండె మీద చేయి వేసుకొని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు, ఆస్పత్రిలో చూపించుకోవచ్చు అనే ధైర్యం ఇచ్చిన ముఖ్యమంత్రి జగనన్న.
* చంద్రబాబు వందల కొద్దీ వాగ్దానాలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు.
* కానీ జగనన్న మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి పేద ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ బస్సు యాత్ర.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు మోసం చేశాడు. జగన్‌మోహన్‌రెడ్డిగారు ఆదుకున్నారు. అందుకే జగన్ గారిని కాపాడుకోవాలి.
మంత్రి విడదల రజని మాట్లాడుతూ..
* బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని విధాలుగా ఎదగడమే సామాజిక సాధికార బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం.
* ఏనాడైనా మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల గురించి, వారి బాగోగులు, సాధికారత, ఎదుగుదల గురించి ఆలోచించిన రాజకీయపార్టీ, నేత ఎవరైనా ఉన్నారా?
* ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా.. జగనన్న మనకు ఉన్నారని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది.
* కేబినెట్‌లో 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అవకాశం. వార్డు మెంబర్‌నుంచి రాజ్యసభ వరకు జగనన్న అవకాశాలు ఇచ్చారు.
* బీసీలకు ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు జగనన్న. బీసీల వెనుక ఓ పార్టీ ఉందంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ఏలూరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత జగనన్నది.
* మహిళలకు ఏరోజూ ఇంత గుర్తింపు, ఇంత ప్రాధాన్యం లేదు. 90 శాతం నవరత్నాల్లో పథకాలు మహిళలకే అందుతున్నాయి.
* బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, విద్యార్థులు యువత సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదా?
* భావితరాలు కూడా సంతోషంగా ఉండాలంటే, మన కోసం అనుక్షణం పరితపిస్తున్న జగనన్నను కాపాడుకోవాలి.
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ..
* ఎక్కడకెళ్లినా ఒకటే మాట. రావాలి జగన్.. కావాలి జగన్.. 2014లో కలెక్టర్ల మీటింగులో మావాళ్లకే పనులు చేయాలంటూ చంద్రబాబు చెప్పాడు.
* కానీ జగన్ గారు పార్టీలు, కులాలు, మతాలు, ఓటు వేయని వారికి కూడా అందరికీ చేయండని చెప్పారు.
* కాలు బయట పెట్టకుండా, గడప దాటకుండా అన్ని పథకాలు అందించిన ఒకే ఒక్కడు జగన్‌మోహన్‌రెడ్డిగారు.
* పేదరికం నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని అందరినీ చదివిస్తున్నారు.
* సాధికారత లేనిది గత ప్రభుత్వం. సాధికారత ఉన్నది జగన్‌గారి ప్రభుత్వం.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..
* పేదవాళ్ల కోసం, బాగోగుల కోసం జగనన్న అహర్నిశలు కష్టపడుతున్నారు.
* మంచి స్కూళ్లు ఉండాలని, ఇంగ్లీష్ మీడింయం ఉండాలని జగన్ గారు కోరుకున్నారు.
* గత నాయకులు ఎంగిలి విసిరి కాకిలెక్కలు చెప్పుకున్నారు. పేదవాళ్ల మీద పెత్తనం చేసిన వాళ్లనే చూశాం. రాజకీయాలు మీకెందుకురా అన్న వాళ్లను చూశాం.
* కానీ పదవులు మీవే, పార్టీలు మీవేనని జగన్ గారు చెబుతున్నారు.
* మన పిల్లలు చదువుతుంటే పెత్తందార్లకు బాధ. కేసులు వేసి అడ్డుకున్నారు.
* అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లారు.
* మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే, మన రైతులు బాగుండాలంటే జగనన్న రావాలి.
ఇదీ చదవండి: CM Jagan Humanity: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధుడి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్