HomeLife StyleWeight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..

Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..

Weight Loss best tips: సరైన ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. తినే టైమింగ్స్ వల్ల కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇటీవల ఓ సంస్థ జసాన్ విజ్ అనే హెల్త్ అండ్ ఫ్యాట్ లాస్ కోచ్ ద్వారా కీలక విషయాలను ప్రచురించింది. ఇందులో డిన్నర్ టైమింగ్ పై ప్రత్యేకంగా చర్చించింది. ఒక్కొక్కరికి ఒక్కో జీవన విధానం ఉంటుందని జసాన్ తెలిపారు. (Weight Loss best tips)

నిజంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలని… అంతేతప్ప బోర్ డమ్ ఫీలయి భోజనం చేయకూడదని జసాన్ విజ్ సూచించారు. డిన్నర్ చేయడానికి ఏది సరైన సమయమో తెలుసుకునేందుకు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయకూడదు. (Weight Loss best tips)

బరువు తగ్గాలి అనుకునే వారు వ్యాయామం చేయడంతో పాటు.. ఆహార నియమాలు పాటిస్తారు. ఏం తినాలి.. ఎంత తినాలి.. అని డైట్ చార్ట్ మెయింటెయిన్ చేస్తారు. కానీ ఎప్పుడు తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో చాలామంది… సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ చేయాలని చెబుతుంటారు. ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారని హెచ్చరిస్తారు.

రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కొంత విరామం ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా నిద్ర పోవడానికి కాసేపు ముందు భోజనం చేస్తే… శరీర విశ్రాంతికి ఆటంకం కలుగుతుంది. ఇది నిద్ర రాకపోవడానికి కారణం అవుతుంది.

ప్రతీ మనిషికి సాయంత్రం వరకు ఆహార జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అసౌకర్యం వంటి సమస్యలు కలుగుతాయి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన జీర్ణరసాలు పైకి ఎగబాకే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్యాస్ట్రో ఈసో ఫ్యాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ (GERD) వస్తుంది. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది.

రాత్రి ఆలస్యంగా ఎక్కువగా భోజనం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రపోయేటప్పుడు శరీరం యాక్టివ్ గా ఉండదు. కాబట్టి క్యాలరీస్ ఖర్చు కావు. ఇదే కాకుండా కొంతమంది… రాత్రిపూట అనారోగ్యకరమైన స్నాక్స్ తింటారు. ఇది కూడా బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. లేట్ నైట్ డిన్నర్ వల్ల శరీరంలో గ్లూకోజ్ శాతం కూడా పెరుగుతుంది. గ్లూకోస్ మెటాలిజంపై జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితులు టైప్-2 డయాబెటిస్ కు దారి తీస్తాయి.

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల…. హార్మోన్ లెవెల్స్ పైన కూడా ప్రభావం పడుతుంది. ఇన్సులిన్ తోపాటు ఆకలి కలిగించే గ్రేలిన్ హార్మోన్ లెవెల్స్ అస్తవ్యస్తంగా మారుతాయి. ఈ పరిస్థితి ఓవర్ ఈటింగ్ కు దారితీస్తుంది. అతిగా ఆకలి, అతి తిండి బరువు పెరగడానికి కారణం అవుతుంది.

డిన్నర్‌ సమయాన్ని సెట్‌ చేసుకోవాలి

భోజనానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కొంత వ్యవధి ఉండేలా చూసుకోవాలి.‌ రోజూ ఒకే సమయానికి భోజనం చేసేలా జాగ్రత్త పాటించాలి. తిన్న వెంటనే నిద్రపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీర్ణవ్యవస్థను పరిగణలోకి తీసుకుంటూ సరైన డిన్నర్ సమయాన్ని సెట్ చేసుకోవాలి.

చాలామంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. అందులోనూ ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్ ఎంపిక చేసుకుంటారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల డైట్ అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ పెరగడమే ఎందుకు కారణం.

ఇదీ చదవండి: Skipping: స్కిప్పింగ్ చేస్తే బరువు తగ్గుతారా? లాభాలు తెలుసుకోవాలా? అయితే ఈ కథనం మీకోసమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు