Fennel Benefits: ఆరోగ్యాన్ని రక్షించే వాటిలో సోంపూ (Sompu) ముందు వరుసలో ఉంటుంది. ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల రోగాలను రాకుండా చేస్తుందంటున్నారు. సోంపూను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. గుండెకు మేలు జరుగుతుందని, ఆరోగ్యవంతమైన గుండెకు సోంపూ దోహదం చేస్తుందంటున్నారు. (Fennel Benefits)
Read Also : Teeth Pain: పంటి నొప్పితో అల్లాడుతున్నారా.. ఈ టిప్స్ ప్రయత్నించండి..
ఆరోగ్యం విషయంలో అనేక మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉండే దినుసులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనసొంతం చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ప్రతి ఇంట్లో లభించేది సోంపూ. సోంపూ వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సోంపూలో క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం లాంటి అనేక పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారికి సోంపూ తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది. సోంపూలో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపూను ఎక్కువగా తీసుకుంటుంటారు. సోంపూ తీసుకుంటే కంటి చూపు కూడా మెరుగవుతుంది.
Read Also : Wrong Food Combinations: రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు తెలుసా? ఇలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందట..
సోంపూ, చక్కెరతో ఏం చేయాలంటే..
దృష్టి లోపాలు ఉన్న వారు సోంపూను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సోంపూలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పదార్థాలను తింటే స్థూలకాయం సమస్య తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. రోజూ ఖాళీ కడుపుతో సోంపూ తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పొట్టలో సమస్యలు తగ్గుతాయి.
నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు సోంపూ తింటే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సోంపూ దోహదపడుతుంది. సోంపూ, చక్కెర కలిపి రోజూ భోజనం తిన్నాక ఓ స్పూన్ తినడం వల్ల అరుగుదల సమస్య ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
Read Also : Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్.. ఇలా ప్రయత్నించండి..
