Wrong Food Combinations: రోజూ మనం వివిధ రకాల ఆహారం తీసుకుంటుంటాం. ప్రస్తుతం మధ్యాహ్న భోజనంలో అన్నం కామనే అయినప్పటికీ కూరల విషయానికి వచ్చేసరికి పలు రకాల కర్రీలు చేసుకొని తింటుంటాం. ఇందులో కాంబినేషన్లు కొన్ని మహా టేస్టీగా ఉంటాయి. ఇలా కూరల్లో, తినే ఆహారంలో అనేక రకాల కాంబినేషన్లు చేసుకొని నిత్య జీవితంలో విందు ఆరగిస్తుంటాం. అయితే, ఫుడ్ విషయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే రాంగ్ ఫుడ్ కాంబినేషన్. (Wrong Food Combinations)
కొన్ని రకాల ఆహారాలు నేరుగా తీసుకోవడానికి బదులుగా కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటుంటాం. ఇలాంటి వాటిలో ప్రమాదకరమైనవి ఉన్నాయి. అవి..
1. చికెన్ లేదా మటన్ బిర్యానీ. బిర్యానీకి కూల్ డ్రింక్స్ కాంబో చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలా బిర్యానీకి కూల్ డ్రింక్స్.. అంటే థమ్సప్, స్ప్రైట్, కోకోకోలా లాంటి కూల్ డ్రింక్స్ కలిపి తింటుంటారు. ఇవి చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగడమే మంచిది కాదని, అలాంటిది మటన్ లేదా చికెన్ బిర్యానీలో కూల్ డ్రింక్స్ కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Eating Food: ఆహారం రోజుకు ఎన్నిసార్లు తినాలి?
2. పాలు-పండ్లు కలిపి తీసుకోరాదు. చాలా మంది జూసుల్లో, స్మూతీస్‌లో పాలు కలుపుతుంటారు. కానీ ఇది మంచిది కాదని, ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
3. బీన్స్ తిన్న తర్వాత గుడ్లు, నాన్ వెజ్ పదార్థాలు తినకూడదు. రెగ్యులర్‌గా బీన్స్ ఫ్రై, బీన్స్ కర్రీ కలిపి అన్నంలో తింటూ ఉంటారు. ఇలా తిన్న తర్వాత చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోరాదట.
Read Also : Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!
4. సిట్రస్ ఫ్రూట్స్, స్వీట్ ఫ్రూట్స్ కలిపి తీసుకోరాదు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే కమలా, బత్తాయి, నారింజ ఇలాంటి పండ్లను స్వీట్స్ ఫ్రూట్స్‌తో కలిపి తినరాదు. స్వీట్ ఫ్రూట్స్ అంటే యాపిల్, మామిడి పండ్లు లాంటివి. ఇలాంటి వాటితో మిక్స్ చేయకూడదు.
ఇలా మీరు రాంగ్ ఫుడ్ ఫుడ్ ఆ రోజు ఆ పూటకు మీకు సమస్య రాకపోవచ్చు. అయితే, లాంగ్ టర్మ్‌లో చర్మ సంబంధ సమస్యలు, అరుగుదల సమస్యలు (డైజెషన్ ప్రాబ్లమ్స్), అలర్జీ లాంటివి అటాక్ చేస్తాయని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Unhealthy Food: ఐదు రకాల ఫుడ్‌కు దూరంగా ఉంటే అనారోగ్యం దరిచేరదు.. అవేంటో చూడండి..