Teeth Pain: పంటి నొప్పితో అల్లాడుతున్నారా.. ఈ టిప్స్ ప్రయత్నించండి..

పళ్లు, చిగుళ్ల సమస్యతో (Teeth Pain) చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దంత సౌందర్యం ఉంటే బయట సమాజంలోకి వెళ్లినప్పుడు సంపూర్ణంగా నవ్వగలుగుతారు. ఆహారం నమిలి మింగడానికి పళ్ల ఆరోగ్యం చాలా అవసరం. చాలా మందికి పంటి నొప్పి (Teeth Pain) బాధిస్తూ ఉంటుంది. సరిగా బ్రష్ చేయాలన్నా కూడా అల్లాడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల పళ్లు, నోటి సమస్యను (Teeth Pain) దూరం చేసుకోవచ్చు.

1. దంతాలు చక్కగా ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా మెయిన్ టెన్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తలు తీసుకోకపోతే టీత్ పుసుపు రంగులోకి మారతాయి.

2. నలుగురిలో కలిసినప్పుడు నవ్వాలన్నా ఇబ్బంది పడతారు. పళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

3. చిగుళ్ల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఏది పడితే అది తినడం వల్ల, లేదంటే ప్రమాదాల్లో ఏవైనా దెబ్బలు తగడం వల్ల పళ్లు దెబ్బతింటాయి.

4. పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే చిగుళ్ల పటిష్టత ముఖ్యం. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వాపు లాంటి సమస్యలు ఒకసారి మొదలైతే అంత సులభంగా తగ్గవు.

5. నొప్పి తగ్గిపోవాలంటే దంత వైద్యులను సంప్రదించాల్సిందే. అయితే, డెంటిస్టును వద్దకు వెళ్లాలన్నా కొందరికి భయమే. లేనిపోనివి చెప్పి పళ్లు పీకేస్తారనే భయంతో చాలా మంది అటువైపు వెళ్లడానికే ఇష్టపడరు.

6. భరించలేని పంటి నొప్పి వచ్చిన సందర్భాల్లో ఇంట్లోనే కొన్ని పద్ధతులు పాటించి ఉపశమనం పొందవచ్చు.

7. కాస్త ఉప్పును లేదా మిరియాల పొడిని తీసుకొని పంటి నొప్పి ఉన్న ప్రాంతాల్లో పూసుకోవాలి. ఇలా చేస్తే తక్షణం నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది.

8. పంటి నొప్పి మరీ ఎక్కువగా ఉన్న సమయంలో వేడి నీటిని తీసుకొని అందులో ఓ చిటికెడు సాల్ట్ వేయాలి.

9. ఆ నీటిని ఓ పదినిమిషాలు నోట్లో పుక్కిలించాలి. రోజులో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ఇలా చేస్తే క్రిములు నశిస్తాయి. బిగ్ రిలీఫ్ ఇస్తుంది.

Nuts: నట్స్ తింటున్నారా? ఎంతసేపు నానబెట్టాలి?

రోజువారీ దిన చర్యలో నట్స్ ని భాగం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది నట్స్ తినడాన్ని మహా ఇష్టపడుతుంటారు. పిల్లలు, పెద్దలు కూడా నట్స్ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. నట్స్ లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ కొన్ని గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నట్స్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

1. వివిధ రకాల గింజల్లో విటమిన్ ఇ, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి, థయామిన్ తదితర పోషక విలువలు దాగి ఉంటాయి.

2. ముఖ్యంగా మనం ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇలాంటివి ఎక్కువ మంది తినడానికి ఇష్టపడుతుంటారు. కొందరు ఇష్టమైన వంటకాల్లో కలిపి తింటుంటారు.

3. ఇవి కలిపిన వంటల రుచి పెరుగుతుంది. పచ్చి గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి.

4. నట్స్ తినడం వల్ల కడుపులో మంట, గుండెల్లో మంట లాంటి సమస్యలను తగ్గిస్తాయి. అయితే, పచ్చి నట్స్ తినడం వల్ల జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

5. వాటిని నానబెట్టి తీసుకోవడం వల్ల విటమిన్లు మన శరీరానికి దక్కడంతో పాటు జీర్ణం కూడా త్వరగా అయ్యేలా చేస్తాయి.

6. గింజలను నేరుగా తనడం వల్ల వచ్చే సమస్యలకు చెక్ పెట్టాలంటే వాటిని కాస్త ఉప్పు వేసి నానబెట్టి తర్వాత తీసుకోవాలి.

7. గింజలను ఎంత సేపు నానబెట్టాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. వాల్ నట్ లు, బాదం పప్పు లాంటివి గట్టిగా ఉంటాయి కాబట్టి.. సుమారు 7 నుంచి 8 గంటలపాటు నానబెట్టాలి.

8. ఎండు ద్రాక్ష లేదా ఫైన్ గింజల్లాంటివి అయితే ఐదారు గంటలపాటు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. నానబెట్టిన తర్వాత వాటి తొక్క తీసి తినాలి.

Read Also : Health tips: తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్‌ కోసం ఇలా చేయండి..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles