The Wire Story on Viveka murder case: దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందుగా ఈ హత్య జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు అధికారులు మారినప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. దీనిపై ఏపీలో రాజకీయ దుమారం కూడా రేగిన సంగతి తెలిసిందే. (The Wire Story on Viveka murder case)
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఈ కేసును (YS Vivekananda Reddy Murder Case) అడ్డు పెట్టుకొని రాజకీయంగా మైలేజీ కోసం తహతహలాడుతోంది. తాజాగా ఈ కేసులో వాంగ్మూలాలు బయటకొస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) వాంగ్మూలం బయటకొచ్చింది. ఇంకా పలువురి వాంగ్మూలాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో వివేకా మర్డర్ కేసులో సీబీఐ విచారణపై “ది వైర్” సంచలన కథనం ఇచ్చింది.
సీబీఐ తుది ఛార్జ్ షీట్ తప్పులతడక అంటూ ‘ది వైర్’ (The Wire) విశ్లేషణాత్మక కథనం అందించింది. వివేకా హత్యపై ఛార్జ్ షీట్ లో అసంబద్ధ కథనాలు వండివార్చిన సీబీఐ అంటూ ది వైర్ కథనం పేర్కొంది. వివేకా హత్యకు కడప ఎంపీ సీటు కారణమంటూ సీబీఐ కథ అల్లిందని పేర్కొంది. కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదని వివేకా వాదించినట్టు సీబీఐ చార్జ్ షీట్ వేసిందని కథనంలో పేర్కొంది.
సీబీఐ కారణాలను, వివేకా కుమార్తె, అల్లుడు వాంగ్మూలకు పొంతన కుదరడం లేదని ది వైర్ కథనంలో పేర్కొంది. వివేకా మరణానికి ముందే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించినట్టు వివేకా అల్లుడు నర్రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తు చేసింది. చాలా రోజుల కిందటే రాజకీయాల నుంచి తండ్రి రిటైర్ అయినట్టు సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ది వైర్ తెలిపింది.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు వ్యతిరేకంగా భాస్కర్ రెడ్డి కుటుంబం కుట్ర పన్నిందని ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సీబీఐ.. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగానే వివేకా హత్య అంటూ సీబీఐ కథ అల్లిందని కథనంలో పేర్కొన్నారు. వివేకా హత్యకు, 2017 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం పై సీబీఐ ఆధారం చూపలేదని కథనంలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే హత్య అంటూ చూపెట్టేందుకు సీబీఐ తాపత్రయ పడుతోందని ది వైర్ కథనం వెల్లడించింది.
కుటుంబంలోని ఆస్తితగాదాలను సీబీఐ పట్టించుకోలేదని ది వైర్ కథనంలో తెలిపింది. బయట వ్యక్తుల ప్రమేయం పై సీబీఐ విచారించలేదని ‘ది వైర్’ కథనంలో ఎత్తి చూపారు. వివేకాను హత్య చేసిన దస్తగిరి, వాచ్ మెన్ రంగన్న మాటలతోనే సీబీఐ విచారణ సాగుతోదని ది వైర్ కథనం పేర్కొంది. దస్తగిరి, రంగన్న మాటలకు ఛార్జ్ షీట్ లో ఒక్క ఆధారం కూడా సీబీఐ చూపలేదంది. ముగ్గురు విచారణ అధికారులు ఏళ్ల తరబడి విచారించినా వాస్తవాలను సీబీఐ కనుగొనలేదంటూ ‘ది వైర్’ కథనం విశ్లేషించింది.
https://thewire.in/politics/fact-fiction-cbi-vivekananda-reddy-murder-case
