Kishan Reddy fire on KCR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నిన్న బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ముఖ్య నేతంలతా హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన పోవాలని, బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలని నేతలు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. (Kishan Reddy fire on KCR)
ఏపీ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించింది..
పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించిందని బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్రంలోమాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి సోయి లేదా? అని ప్రశ్నలు గుప్పించారు. తొమ్మిదేళ్ల నుంచి పేద ప్రజలకు ఇళ్లు ఇస్తామని మాట చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు.
మీ కుటుంబానికి, మీకు బానిసలం కాదంటూ కేసీఆర్‌కు హెచ్చరించారు కిషన్‌రెడ్డి. కేసీఆర్ దోపిడీ చేస్తుంటే మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. “తెలంగాణ సొమ్ము వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంటే అడగకూడదా? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మేం మాట్లాడకూడదా? బయ్యారంలో స్టీల్ ప్లాంటు పెడతామని 2018లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేస్తే మేం మాట్లాడొద్దా?
దళిత ముఖ్యమంత్రి అన్నారు.. ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు? కేజీ టు పీజీ విద్య ఏమైంది? రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.. ఏమైంది? పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు కట్టింది ఆ ప్రభుత్వం.. సోయి లేదు వీళ్లకు.. ఆయన మాత్రం నాలుగు నెలల్లో పదెకరాల్లో ప్రభుత్వ ధనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిజాం భవనాన్ని తలపించేలా భవనం కట్టుకున్నాడు…” అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
ఏపీ ప్రభుత్వంతో పోలికపై కేసీఆర్ సర్కార్ స్పందిస్తుందా?
కేంద్ర మంత్రిగా పని చేసిన కిషన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కళ్లారా చూసే ఉంటారు. ఇందులో భాగంగానే జగన్ సర్కార్ 30 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు 20 లక్షల ఇళ్లు కట్టిస్తోంది. వాటిలో ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తయ్యాయి. మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి పర్యటనలు కూడా చేశారు. సీఎం జగన్‌తో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది.
ఏపీలో ఇక్కడి బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ సైతం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ సర్కారుతో కూడా జగన్ సఖ్యతగానే ఉంటున్నారు. అయితే, జగన్‌తో ముడిపెడుతూ అభివృద్ధిపై కిషన్‌రెడ్డి ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కేసీఆర్ సర్కార్ ఏరకంగా స్పందిస్తుందో చూడాల్సిందే.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేదలకు 20 లక్షల ఇళ్ళు కట్టి ఇస్తే, నీకు సోయి లేదా కేసీఆర్? – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి#KishanReddy #KishanReddy4Telangana #CMYSJagan #AndhraPradesh #Telangana #CMKCR #YSJagan #KCR #NTVTelugu pic.twitter.com/DrvxINOwMY
— NTV Telugu (@NtvTeluguLive) July 21, 2023
Read Also : New Presidents to BJP: అధ్యక్షుల మార్పు.. ఎన్నికల్లో ఫలితమిస్తుందా? బీజేపీ వ్యూహాత్మక అడుగులు!