Healthy Nuts: రోజూ నాలుగు ఆల్మండ్స్ తీసుకుంటే మన శరీరంలో భారీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులంటున్నారు. శరీరంలోని జాయింట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్ తీసుకోవడం ముఖ్యమని వైద్యులు, డైటీషియన్లు సూచిస్తున్నారు. నిర్దిష్ట ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పౌష్టికాహారం అందుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బోన్స్, జాయింట్స్ పటిష్టత కోసం నట్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. నట్స్‌లోనూ ప్రస్తుతం అనేక రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. (Healthy Nuts)
నిత్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకొనే ఆహారంలో తప్పక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, తక్కువ ఖర్చులో లభించే వాటిలోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోవడం ద్వారా అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also : Best health tips: ఏ జబ్బు తగ్గాలన్నా రాత్రిపూట ఇవి తిని ప్రయత్నించండి.. మార్పు గ్యారెంటీ..
వీటిలో ముఖ్యమైనది ఆల్మండ్స్. రోజూ ఆల్మండ్స్‌ను తీసుకోవడం అనేది మన శరీరానికి చాలా మేలు చేస్తుందంటున్నారు. రోజుకు నాలుగు లేదా ఐదు ఆల్మండ్స్ తీసుకొని నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం వల్ల బాడీకి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయంటున్నారు. జీర్ణశక్తి మెరుగుదలకు, ఎముకల పటిష్టతకు ఆల్మండ్స్ దోహదం చేస్తాయంటున్నారు. మన బాడీలో భాగాలు లూబ్రికేట్ అవ్వడానికి ఆల్మండ్స్ ఉపయోగపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు మనకు తక్కువ ధరకే లభించే నట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తాగునీరు కూడా తగిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం నాలుగు లీటర్లు తాగాలని చెబుతున్నారు. ఈ చలికాలంలో నాలుగు లీటర్లంటే కాస్త కష్టమే. అయితే, వేసవి కాలంలో కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్లు రోజూ తాగగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మన బాడీలో స్ట్రెంత్ పెరుగుతుందంటున్నారు. కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటున్నారు. మంచి లూబ్రికేషన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ముఖం కాంతివంతంగా తయారవుతుందని చెబుతున్నారు.
Read Also : Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!
