HomeAndhra PradeshMinister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం

Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం

Minister Roja: ఏపీలో వలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ చేసిన కామెంట్లతో కాక రేగిన విషయం తెలిసిందే. పవన్‌పై భగ్గుమన్న వలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పవన్‌ దిష్టిబొమ్మల దహనం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా రియాక్ట్‌ అయ్యారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. వలంటీర్ల వ్యవస్థపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. వలంటీర్ల వ్యవస్ధ ప్రజలకు అండగా ఉంటోందని రోజా స్పష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థను పవన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. (Minister Roja)

వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్కే రోజా (Minister RK Roja) గుర్తు చేశారు. పవన్ (Pawan Kalyan) వలంటీర్ల వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. ప్రతి కుటుంబంలో కష్టాలను దూరం చేస్తున్నది వాలంటీర్లేనని స్పష్టం చేశారు. ఒక కుటుంబానికి కష్టం వస్తే మొదట ఫోన్ చేసేది వలంటీర్‌కేనని, అలాంటి వారిపై వికృత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే చంద్రబాబు (Chandrababu) తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.

Read Also: CM Jagan on Pawan: రౌడీల్లా బూతులు తిట్టలేం.. నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం.. పవన్‌పై జగన్ హాట్ కామెంట్స్..

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. వలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్ కల్యాణ్ క్షమాపణ అడగాలని డిమాండ్‌ చేశారు. వలంటీర్లను చంద్రబాబు చులకన చేసి మాట్లాడారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కు రిపోర్ట్ ఎవరిచ్చారని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ లేదని రోజా తెలిపారు. తన తల్లిని తిట్టినవాళ్లను గెలిపించమని పవన్ ప్రాధేయపడటం సిగ్గుచేటన్నారు.

మీ అమ్మ, భార్యను తిట్టింది టీడీపీ నేతలే పవన్‌.. అంటూ రోజా గుర్తు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణకు (ABN Radhakrishna) సిగ్గు లేకుండా ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావని రోజా ప్రశ్నించారు. మిస్సింగ్ కు, అక్రమ రవాణాకు తేడా తెలుసా అని పవన్‌ను నిలదీశారు. బాబు హయాంలోని కాల్ మనీ సెక్స్ రాకెట్ పై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నలు గుప్పించారు రోజా. సీఎం జగన్ పాలన ఓర్వలేక పవన్ తప్పుడు విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అలాంటి వ్యవస్థను కించపరిచేలా మాట్లాడ్డం దారుణమని రోజా అన్నారు.

Read Also : Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్‌ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు