HomeSportsWest indies: ప్రపంచ క్రికెట్‌లో ఘోర పరాభవం.. ఘన చరిత్ర నుంచి అట్టడుగుకు కరీబియన్‌ జట్టు!

West indies: ప్రపంచ క్రికెట్‌లో ఘోర పరాభవం.. ఘన చరిత్ర నుంచి అట్టడుగుకు కరీబియన్‌ జట్టు!

West indies: వెస్టిండీస్‌ జట్టు.. తొట్టతొలి ప్రపంచకప్‌ ఆ జట్టుదే. మూడోసారి కూడా ఫైనల్‌కు చేరిన ఘనమైన చరిత్ర.. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన దుస్థితి. కరీబియన్‌ జట్టుకు ఇంతటి దుర్గతి ఎందుకు పట్టింది? ఉద్ధండులైన ఆల్‌ రౌండర్లు, భీకర షాట్లు ఆడే బ్యాటర్లు, బౌలింగ్‌లో చుక్కలు చూపించగలిగే పేసర్లు ఉన్నప్పటికీ… స్కాట్లాండ్‌ లాంటి దేశంపై కూడా గెలుపు గుర్రాలపై స్వారాలో ఓడిపోయింది కరీబియన్‌ జట్టు. దీంతో మొదటిసారి వెస్టిండీస్‌ లేకుండా వన్డే ప్రపంచకప్‌ పోరు జరుగుతోంది. (West indies)

ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో భాగంగా స్కాట్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ దారుణంగా ఓటమిపాలైంది. క్వాలిఫయింగ్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ జట్టుపై పరాజయం పాలైంది. దీంతో ప్రపంచకప్‌లో పాల్గొనే చాన్స్‌ లేకుండాపోయింది. 1975, 1979లో రెండు సార్లు ప్రపంచకప్ గెలిచింది వెస్టిడీస్. మరోసారి ఫైనల్‌కు కూడా చేరింది. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన వెస్టిండీస్‌ను ఈ సారి ప్రపంచకప్‌లో చూడలేం. సగటు క్రికెట్‌ అభిమానికి, ముఖ్యంగా కరీబియన్‌ అభిమానులకు ఇది మిక్కిలి చేదు వార్త.

WC Qualifiers Highlights: West Indies' CWC 2023 dream ends after Scotland  loss | Cricket - Hindustan Times

మేటి ఆటగాళ్లున్నా ఎందుకీ దుస్థితి?

వెస్టిండీస్‌లో మేటి ఆటగాళ్లున్నారు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో తమ ప్రతాపం చూపించే విండీస్‌ బ్యాటర్లు.. జాతీయ జట్టుకు ఆడటంలో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. పసలేని ఆటతో పసికూనల చేతిలో ఓడిపోతున్నారు. శనివారం ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో ఓటమితో వన్డే వరల్డ్‌ కప్‌కు ఆ జట్టుకు దారులు మూసుకుపోయాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన విండీస్‌ 7 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. జేసన్‌ హోల్డర్‌ (45), రొమారియో షెఫర్డ్‌ (36) చెరో కొన్ని పరుగులు చేయకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా మారి ఉండేది. ఈ ఇద్దరు మినహా ఆ జట్టులో మరే బ్యాటర్‌ కూడా 22 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు.

మెక్‌ములెన్‌ (3/32), మార్క్‌ వాట్‌ (2/25), క్రిస్‌ గ్రేవ్స్‌ (2/30), క్రిస్‌ సోల్‌ (2/43) వికెట్లు తీసుకున్నారు. చిన్న జట్టుగా భావించిన స్కాట్లాండ్‌ బ్యాటర్లను విండీస్‌ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. మాథ్యూ క్రాస్‌ (74 నాటౌట్‌), మెక్‌ములెన్‌ (69) అర్ధశతకాలతో మెప్పించారు. స్కాట్లాండ్‌ 43.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇద్దరిని ఆపలేక విండీస్‌ బౌలర్లు చేతులెత్తేశారు. అంతకుముందు లీగ్‌ దశ చివరి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతుల్లో కూడా కరీబియన్‌ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

విండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌, వికెటర్‌ కీపర్‌ అయిన నికోలస్‌ పూరన్‌, ఆల్‌ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెపర్డ్‌, బ్రాండన్‌ కింగ్‌, షై హోప్‌, కైలే మేయర్స్‌, అకేల్‌ హోసైన్‌.. లాంటి వారు జట్టులో ఉన్నప్పటికీ చిన్న జట్టు చేతిలో ఓటమి పాలవడం ఆ జట్టును కుంగదీస్తోంది. మళ్లీ మరో నాలుగేళ్ల దాకా వన్డే వరల్డ్‌ కప్‌ లేకపోవడంతో అప్పటికి ఎవరు ఉంటారో, ఎవరు రిటైర్‌ అవుతారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కనీసం టీ20 వరల్డ్‌ కప్‌ సమయానికైనా కోలుకొని తమ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : Team India: వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గాలంటే అలాంటి విషయాన్ని మర్చిపోవాలి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు