టీమిండియా (Team India) వరల్డ్ కప్ (ODI World Cup) గెలిచి సుమారు దశాబ్దకాలం అయ్యింది. ఎంఎస్ ధోని (MS Dhoni) సారథ్యంలోని టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌కప్ (2011 ODI World Cup) నెగ్గిన విషయం తెలిసిందే. తర్వాత అన్ని ఐసీసీ ట్రోఫీల్లో (ICC Trophy) భారత్ (India) విఫలమవుతూ వస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ (ICC Champions Trophy) ట్రోఫీ శ్రీలంక (Srilanka) గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లలోనూ (T20 World Cup) టీమిండియా (Team India) విఫలమవుతూ వస్తోంది.
ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో భారత్ పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. ఆ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని రనౌట్ (MS Dhoni Runout) కావడంతో అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. క్రికెట్‌ను అంతలా ఇష్టపడతారు భారత అభిమానులు. ఈ క్రమంలో ప్రస్తుతం వచ్చే వన్డే వరల్డ్ కప్ నెగ్గాలని టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. 2023లో జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా కప్పును ముద్దాడాలని చూస్తోంది భారత్.
భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను మనం గెలవాలాంటే రెస్ట్ అనే పదం మర్చిపోవాలని సూచించాడు. ఆటగాళ్లతోపాటు బీసీసీఐ (BCCI) కూడా విశ్రాంతిని మర్చిపోవాలని సూచించాడు. ఈ మెగా టోర్నీ పూర్తయ్యే వరకు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా ఆడించాలని బీసీసీఐకి హితవు పలికాడు గవాస్కర్.
అన్ని సిరీస్‌లలోనూ ఒకే రకమైన జట్టుతో బరిలోకి దిగితే మంచి ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డాడు సునీల్ గవాస్కర్. అప్పుడు ఒక జట్టు చాలా స్ట్రాంగ్‌గా అవతరిస్తుందని చెప్పాడు. తీరికలేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లపై ఎక్కువ పని భారం పడకూడదనే నెపంతో బీసీసీఐ రొటేషన్ పద్దతిని అవలంభిస్తోందని, ఇలాంటి పద్ధతిని మార్చాలని గవాస్కర్ చెప్పాడు. ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాలని, కానీ వన్డే వరల్డ్‌కప్ నెగ్గాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు.
Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో 7 సిక్సర్లు.. రుతురాజ్ అలా కొట్టాడు!
సాధారణంగా ఒక ఓవర్లో ఎన్ని బంతులుంటాయి? అదేం ప్రశ్న 6 బాల్స్ కదా.. అని చెబుతారు. అయితే ఇందులో వైడ్ లేదా నో బాల్ వేసినప్పుడు ఇంకో బంతి అదనంగా వేయాల్సి ఉంటుంది. గతంలో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విషయం గుర్తుంది కదా.. ఆ రికార్డును ఓ యువ క్రికెటర్ మొన్నామధ్యే అధిగమించాడు. అదెలాగంటే.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో పాటు మరో నో బాల్‌ను కూడా సిక్సర్‌గా మలచాడు రుతురాజ్ గైక్వాడ్.
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను యువరాజ్ సింగ్‌తోపాటు వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కైరన్ పొలార్డ్ కూడా సమం చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఆ రికార్డులు రెండూ చెరిపేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఇండియా దేశవాళీ టోర్నీలలో ఒకటిగా ఉన్న విజయ్ హజారేట్రోపీ సీజన్ 2022లో ఈ ఉదంతం వెలుగు చూసింది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల మధ్యన జరిగిన మ్యాచ్‌లో రికార్డులు నమోదయ్యాయి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజృంభణ ముందు యూపీ బౌలర్లు నిలువలేకపోయారు. మ్యాచ్‌లో అన్ని ఓవర్లను ఆడిన రుతురాజ్.. బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. 220 పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్‌లో తొలి డబల్ సెంచరీ చేశాడు.
సంచలనం ఎక్కడ నమోదైందంటే.. 49వ ఓవర్లో. రుతురాజ్.. శివ సింగ్ వేసిన 49వ ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఓ బంతి నోబాల్ వేయగా దాన్ని కూడా సిక్సర్‌గా మలచడంతో భారీ రికార్డు సాధ్యమైంది.
Read Also : MS Dhoni: గవాస్కర్ చొక్కాపై ధోని సంతకం..చెపాక్ క్రౌడ్‌కు మహేంద్రుడి ట్రీట్