HomeCinemaActress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్‌! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..

Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్‌! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..

Actress Sahasra Reddy: సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌తో ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు రాణిస్తున్నారు. తమ ప్రతిభను చాటేందుకు సోషల్ మీడియా, యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఇండియాలో ట్యాలెంట్‌కు కొదవలేదంటారు. (Actress Sahasra Reddy)

అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రోజుకో ట్యాలెంట్‌తో ముఖ్యంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నారు. అలాంటి కోవకు చెందిన తెలుగుమ్మాయే సహస్రారెడ్డి (Actress Sahasra Reddy). సోషల్ మీడియా, యూట్యూబ్ బ్యూటీగా తనదైన మార్క్ నటనతో ఆకట్టుకుంటోంది సహస్రా రెడ్డి.

యూట్యూబ్‌లో ‘ఓకే బావ’ అనే వెబ్ సిరీస్‌తో ఈ భామ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం యూత్‌లో ఈమెకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన సహస్రా రెడ్డి.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకుంది.

అనంతరం మోడలింగ్‌పై ఇష్టంతో ఆ వృత్తిలోకి అడుగు పెట్టింది. అయితే, మోడలింగ్‌ ఓ వైపు చేస్తూనే.. మరోవైపు బొటిక్‌ను ఏర్పాటు చేసింది సహస్రా రెడ్డి. ఈ ముద్దుగుమ్మ నటి కాక ముందే సామాజిక మాధ్యమాల్లో చాలా చలాకీగా ఉండేది. ముఖ్యంగా ఫ్యాషన్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు, టిప్స్‌ ఇస్తుండేది.

దాంతోపాటు లేటెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ దుస్తుల గురించి వివరిస్తూ ఫొటోలు, వీడియోలు కూడా తయారు చేసి యువతను ఆకట్టుకొనేంది. అలా ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ భామ.. రాను రానూ యూట్యూబ్‌లో ఫేమ్‌ అయ్యింది. సహస్రా రెడ్డి వీడియోలు చూసిన పలువరు ఆమెను అభినందించేవారు. ఈ క్రమంలోనే ఓ ఊహించని పరిణామం జరిగింది.

సహస్ర వీడియోలను చూసి మెచ్చుకున్న యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్టర్లు పలువరు ఈమెకు నటనలో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే “ప్రేమంటే ఇంతేనేమో”, “ఒక పారు” లాంటి షార్ట్‌ ఫిల్మ్‌లలో నటించింది. ఇందులో ఆమెకు చక్కటి మార్కులు పడ్డాయి.

సహస్ర నటనకు దర్శకులు, సహచర నటులతో పాటు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అటువైపు నుంచి వెబ్‌ సిరీస్‌లలోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎప్పుడైతే “ఓకే బావ” వెబ్‌ సిరీస్‌లో నటించిందో.. అప్పటి నుంచి సహస్రకు పాలోవర్స్‌ ఓ రేంజ్‌లో పెరగడం మొదలైపోయింది.

సహస్ర నటనకు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లకు యువత ముఖ్యంగా కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఇక నటనతోపాటూ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఎప్పటికప్పుడు అందమైన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది సహస్ర. దీంతో ఆమె చేసే ఇన్‌ స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. సో క్యూట్‌, రొమాంటిక్‌, బ్యూటిఫుల్‌ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ హైదరాబాదీ అమ్మడు.. “బావ మరదలు” అనే యూట్యూబ్‌ షార్ట్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేస్తోంది. ఇప్పటికే 20 ఎపిసోడ్లు ఇందులో రిలీజ్‌ అయ్యాయి. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా సహస్ర నటనే ఈ సిరీస్‌లో హైలెట్‌ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

Read Also : Tamannaah Bhatia: విజయ్‌ వర్మతో అందుకే చనువుగా ఉంటున్నా.. మిల్కీబ్యూటీ తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు