HomeLife StyleKidney Disease: కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

Kidney Disease: కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

Kidney Disease: సాధారణంగా చాలా మంది మూత్రపిడాల సమస్యతో బాధపడుతుంటారు. ఇది కొంత మందిలో దీర్ఘకాలిక జబ్బుగా మారుతుంది. వైద్యుల వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మందికి మైక్రో ఆల్బిమునూరియా లేదా ప్రోటీన్యూరియా వచ్చిందని, ఇది మూత్రపిండాల వ్యాధికి తొలి సంకేతమని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇందుకు మధుమేహం, గుండెపోటు కూడా తోడవుతాయని వెల్లడైంది.

చాలా మందికి సోకే జబ్బులను ప్రాథమిక దశలో కనుక్కోలేక సమస్యల్ని తీవ్రతరం చేసుకుంటూ ఉంటారు. నిజానికి ముందస్తుగా లక్షణాలు గుర్తించి వైద్యుల వద్దకు వెళ్లినట్లయితే అనేక వ్యాధులు నివారించుకోవచ్చు. ఇక కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించగలిగితే నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. లేదంటే ఇవి దీర్ఘకాలిక సమస్యగా మారి ప్రాణాంతకంగా అయ్యే ప్రమాదం లేకపోలేదు.

క్రానిక్‌ కిడ్నీ వ్యాధులకు (Kidney Disease) కారణాలను తేల్చేందుకు ఇటీవల ఓ అధ్యయనం జరిపారు. రోగులు ఎక్కువ మంది వ్యాధి చివరి దశకు చేరుకున్నప్పుడు వస్తుంటారని అధ్యయనంలో తేల్చారు. జబ్బు చివరి దశకు చేరుకున్నాక చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, డయాబెటిస్‌, అనేక గుండె జబ్బులు.. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తాయని చెబుతున్నారు.

ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న వారిలో కనీసం 30 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో సఫర్‌ అవుతున్నారని తేలింది. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు లక్షణాలు గుర్తించడం కష్టం. కానీ క్రమంగా మూత్రపిండ వైఫల్యంతో చివరికి ప్రాణాంతకంగా అవుతోందని అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. దాదాపు 1.5 లక్షల మంది రోగులను పరిశీలించిన తర్వాత అధ్యయనం మొదటి దశ ఫలితాలను వెల్లడించినట్లు పరిశోధకులు చెప్పారు.

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చనేది చాలా మంది చెప్పే మాట. ఇది నూటికి నూరు పాళ్లు నిజం అని కూడా పలు అధ్యయనాల్లో తేలింది. ఆపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆపిల్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు ఇవి దోహదపడతాయి. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు.

మరోవైపు పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ జబ్బులు దూరం అవుతాయట. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బీ, విటమిన్ డీ కిడ్నీ జబ్బులను రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రకరకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటి వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక లావుగా ఉండే ఎర్రటి మిర్చీలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్ల మాదిరిగా పని చేస్తాయి. వీటిలో పొటాషియం స్వల్పంగానే ఉంటుంది. దీని వల్ల కిడ్నీలకు మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. తగిన మోతాదులో వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుందని స్పష్టం చేస్తున్నారు.

Read Also : Rose Water: రోజ్‌ వాటర్‌తో ప్రయోజనాలు ఇవీ.. రోజూ తాగండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు