HomeLife StyleBoosting Foods: కోరికలు కలగడం లేదా? ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మార్పు ఖాయం!

Boosting Foods: కోరికలు కలగడం లేదా? ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మార్పు ఖాయం!

Boosting Foods: సాధారణంగా శృంగార కోరికలు అందరికీ ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ ఉంటాయి. అసలు సెక్స్‌పై ఆసక్తి లేని వారూ ఉంటారు. అయితే, ఇద్దరు పార్ట్నర్ల మధ్య శృంగార కోరికలు నార్మల్‌గా ఉంటే ఫర్వాలేదు. కానీ ఒకరిలో ఉండి మరొకరిలో కోరికలు లేకపోతేనే అసలు సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి తరుణంలో భాగస్వామి సెక్స్‌కు సహకరించకపోతే పక్కదారులు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. (Boosting Foods)

శృంగారశక్తికి ప్రధానమైనది టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌. ఈ హార్మోన్‌ ఉత్పత్తి అయితేనే ఎవరికైనా శృంగారపరమైన భావనలు కలుగుతాయి. అయితే, ఇవి కలగాలంటే మన బాడీకి తగిన జింక్‌ అవసరం అవుతుంది. ఇది కోరికలను పెంచడంతోపాటు మహిళలు, పురుషులిద్దరిలోనూ శృంగార శక్తిని, చైతన్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అయితే, జింక్‌ లభించే ఆహార పదార్థాలు కూడా ప్రత్యేకించి ఉన్నాయి. పాలకూర, సెనగలు, గుమ్మడి, సన్ ఫ్లవర్ ఆయిల్, ఓస్టర్ చేపలను తరచూ తినడం వల్ల జింక్‌ సమృద్ధిగా చేకూరుతుంది.

లైంగిక ఆసక్తి పెరగడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతి ఒక్కరూ లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. అందుకు తగిన ప్రణాళిక ఉంటే సరిపోతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే, వయసు పెరిగినా లైంగికంగా చురుగ్గా ఉండాలంటే కొన్ని రకాల విటమిన్లు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇలా చేయడం ద్వారా నిత్యం శృంగారాన్ని ఎంజాయ్‌ చేసే వీలు కలుగుతుందని చెబుతున్నారు.

లైంగిక శక్తి పెంపొందించుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒమేగా-3 తీసుకోవడం వల్ల వయసు తగ్గినట్లు అనిపిస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి ఇది అవసరం. లైంగిక ప్రక్రియలో గుండె, మెదడు చాలా కీలకం మనసు చైతన్యంగా ఉండటానికి ఒమెగా-3 ఉపయోగపడుతుందని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. అవిసె గింజెలు, అవిసె నూనె, సోయాబీన్, ఆలివ్ ఆయిల్, చేపలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లైంగిక శక్తి, శృంగార కోరికలు పెరుగుతాయి.

పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి నిపుణులు ఎలాంటి ఆహారాన్ని సిఫార్సు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

ఆహారాల్లో ఈ మార్పులు చేయండి..

పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు. చేపల్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ తో పాటు చాలా రకాల ప్రొటీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రొటీన్ వివిధ సెక్స్ హార్మోన్లలో ప్రధాన అంశంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు చేపలను తినడం ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు.

చేపలు తినండి:  నిపుణులు చేపలను తినమని సిఫార్సు చేస్తారు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా ప్రొటీన్లు ఉంటాయి.ప్రొటీన్ వివిధ సెక్స్ హార్మోన్లలో ప్రధాన అంశంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు చేపలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. లైంగిక శక్తిని పెంచడంలో ఇది ప్రత్యేకంగా దోహదం చేస్తుందట. జింక్‌ ఫుడ్‌ సంతానోత్పత్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. చికెన్, బచ్చలికూర, గుమ్మడి గింజలు మొదలైన వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుందనేది తెలిసిన విషయమే.

Read Also : Men’s Food: అబ్బాయిలూ.. బీ కేర్‌ ఫుల్‌.. ఈ ఫుడ్ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు