Men’s Food: అబ్బాయిలూ.. బీ కేర్‌ ఫుల్‌.. ఈ ఫుడ్ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం!

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మంచి ఫుడ్‌ తీసుకుంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు కొన్నింటిపై (Men’s Food) దృష్టి పెట్టాలి. కొన్ని తినకూడని పదార్థాలు (Men’s Food) తీసుకుంటే ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లే. ఆరోగ్యకర అలవాట్లే ఆనందానికి కారణమవుతాయి. రోజూ ఎన్నో రకాల పదార్థాలను టింటుంటారు. వాటిలో కొన్ని మంచి చేస్తే కొన్ని మన దేహానికి (Men’s Food) చెడు కలిగిస్తాయి.

1. మగవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలట. వాటిలో ప్రముఖమైంది సోయాబీన్స్. వీటిలో ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. ఇవి మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజన్ లాంటి సమ్మేళనాలు. కాబట్టి వీటిని మగవారు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

2. వీటిని తీసుకుంటే మగవారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వస్తుందంటున్నారు. సోయాబీన్స్ ఎక్కువ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట. తద్వారా సంతోనోత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఇంతటి ప్రతికూలతలున్న వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

3. పురుషులతో పాటు మహిళల ఆరోగ్యానికి కూడా హాని కలిగించే మరో పదార్థం ట్రాన్స్ ఫ్యాట్స్. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.

4. ఇలాంటి పదార్థాలను తింటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పైనా ప్రభావం చూపుతాయి.

5. మాంసాహారం మనం సాధారణంగా చికెన్, మటన్ షాపు నుంచి తెచ్చుకుంటుంటాం. అలా కాకుండా ప్రాసెస్డ్ మాంసాహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలొస్తాయి.

6. రసాయనాలు వాడిన కూరగాయలు, ఆకు కూరలు తిన్నా ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అయితే, నేటి రోజుల్లో పురుగు మందులు వాడని కూరగాయలు, ఆకుకూరలు లేవనే చెప్పాలి. కొవ్వు ఎక్కువగా ఉండే పాల పదార్థాలు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

తక్కువ ఖర్చుతో పోషకాహారం పొందండిలా..

1. మనం ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఎప్పుడైనా నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, నిరంతరం ఆరోగ్యం మీ సొంతం కావాలంటే కొన్ని ఆరోగ్య ప్రమాణాలు, సూత్రాలు పాటించడం తప్పనిసరి.

2. ముఖ్యంగా తీసుకొనే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలి. పోషకాహారం తప్పక తీసుకోవాలి. పోషకాహారమంటే కేవలం ఖరీదైన వాటిలోనే ఉండదు. సామాన్యులకు అందుబాటు ధరల్లో కూడా నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంది.

3. మధ్య తరగతి వారికీ అందుబాటు ధరల్లో దొరికే కొన్ని పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా సజ్జల గురించి చెప్పుకోవాలి. సజ్జలను తినడం వల్ల ప్రొటీన్లు, కేలరీలు బాగా దొరుకుతాయి.

4. పేదవాడి ఆహారంగా కూడా సజ్జలను పిలుస్తారు. సజ్జలను రోజూ తీసుకోవడం వల్ల శారీరకంగా శక్తిమంతులవుతారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు కూడా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి.

5. అరటి పండ్లు కూడా తక్కువ ధరకు దొరికే వాటిలో ఉంటాయి. ఏ సీజన్ లో అయినా ఇవి దొరుకుతాయి. డజన్ రూ.40 నుంచి రూ.80 మధ్య దొరికేస్తాయి.

6. పిల్లలు, పెద్దలు వీటిని తీసుకోవడం వల్ల ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, మాంగనీస్, నియాసిన్, విటమిన్ బి6 సహా అనేక పోషక విలువలు పెంపొందుతాయి. జీర్ణ సమస్యలకు కూడా అరటిపండు చెక్ పెడుతుంది.

7. సీఫుడ్, పౌల్ట్రీ, మాంసానికి ప్రత్యామ్నాయంగా చిక్పీస్ ను వినియోగించవచ్చు. వీటిలో ప్రొటీన్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి.

8. వీటిని తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఆకుకూరల్లో బచ్చలి కూర తీసుకోవడం వల్ల విటమిన్ కె దొరుకుతుంది. పెసరపప్పు తీసుకుంటే ప్రొటీన్లతో పాటు కడుపులో ఆకలి వేయకుండా చాలా సమయం ఉండగలరు.

Read Also : Love Tips : అబ్బాయిలూ.. గర్ల్స్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles