HomeTrendingSleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్‌.. ఇలా ప్రయత్నించండి..

Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్‌.. ఇలా ప్రయత్నించండి..

నిద్రపట్టక (Sleeping Tips) ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పడుకొనే సరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దీంతో సెల్ ఫోన్ వైపు చూస్తూ సమయం వృథా చేసుకుంటూ ఉంటారు. దీనికి తోడు కుటుంబంలోని బరువు బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పిల్లల చదువు సంధ్యలు, ఆఫీసుల్లో సమస్యలు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు.. ఇలా ఒకటేమిటి.. అనేక సమస్యలతో సతమతం అవుతూ సమయానికి నిద్రపోని వారు (Sleeping Tips) కోకొల్లలుగా ఉంటారు. ఇలా నిద్ర తక్కువయ్యే వారికి కళ్ల కింద నల్లగా తయారవుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవాలంటే కొన్ని టిప్స్ (Sleeping Tips) పాటించండి.

1. జీవితంలో ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నా సరిపడా నిద్ర కూడా చాలా అవసరం. ఆరోగ్యకర జీవితానికి కంటినిండి కునుకు తీయడం మస్ట్.

2. రాత్రిపూట భోజనానికి ముందు ఆల్కహాల్ సేవించడం చాలా మందికి అలవాటుగా మారి ఉంటుంది.

3. అయితే, ప్రశాంతమైన నిద్ర రావాలంటే మద్యానికి దూరంగా ఉండాల్సిందేనంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4. ఉదయం పూట వ్యాయామం చేస్తే కండరాలన్నీ కదిలి శరీరం అలసిపోతుంది. రాత్రి పూట నిద్ర రావడానికి సహకరిస్తుంది.

5. కెఫెన్ కలిగిన పదార్థాలను కూడారాత్రి పూట తీసుకోరాదు. అంటే టీ, కాఫీ లాంటివి అస్సలు తీసుకోరాదట.

6. ఇవి మోతాదుకు మించి, వేళ కాని వేళలో తీసుకోవడం వల్ల నిద్రకు డ్యామేజీ ఏర్పడుతుంది.

7. రాత్రి పూట అతిగా కొవ్వు ఉన్న పదార్థాలు కూడా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొవ్వులు నిద్రపై ప్రభావం చూపుతాయి.

8. రాత్రి పూట నిద్ర త్వరగా రావాలంటే మొబైల్ అస్సలు ముట్టరాదు. ఇందులోని బ్లూ లైట్ కళ్లకు హాని చేస్తుంది.

9. చీకట్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. అల్లం, తులసి, కుంకుమ పువ్వు లాంటి పదార్థాలతో టీ చేసుకొని తాగితే మంచి నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

10. నిద్రతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుముఖం పడతాయి.

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఇలా చేయండి..

1. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.

2. జీవితంలో చాలామంది ఆర్థిక కష్టాలు, సామాజిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

3. కొన్నిసార్లు ఎన్ని ప్రత్యామ్నాయాలు పాటించినా కష్టాలు మాత్రం తొలగిపోవు. అందుకు ఇంటి వాస్తు సరిగా లేకపోవడం కూడాకారణం అయి ఉండొచ్చు.

4. దీన్ని సకాలంలో గుర్తించి వాస్తు నియమాలు ఫాలో అయితే చాలా వరకుకష్టాలు తీరే అవకాశం ఉంటుంది.

5. జ్యోతిష్య, వాస్తు శాస్తు శాస్త్రాలకు విశేష ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా వాస్తు నియమాలు పాటిస్తే ఎంతటి క్లిష్ట సమస్య అయినా పరిష్కారం అవుతుంది.

6. మనిషి జీవితంలోని శ్రేయస్సు, వృద్ధి, సంతోషాన్ని కలిగించే పాజిటివ్ ఎనర్జీకి వాస్తు నియమాలు కారణం అవుతాయి.

7. ఇటి పరిసరాలను వాస్తు ప్రకారం క్రమ పద్ధతిలో ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

8. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఓ మార్గదర్శిగా ఉంటుందని చెప్పొచ్చు.

9. జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించాలని, ఆరోగ్యంగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

10. అయినప్పటికీ ఫలితాలు రాకపోవడంతో నిరాశలో బతుకీడుస్తుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని వాస్తు టిప్స్ ఉన్నాయి.

11. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఓపెన్ షూ స్టాండ్ ఉంచరాదట. ఇది ప్రతికూలతకు సంకేతంగా ఉంటుంది. షూ రాక్ పశ్చిమ లేదా నైరుతి మూల్లో ఉంచుకోవచ్చు.

12. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తులసి మొక్క ఉంచాలి. తూర్పు దిశ ఉత్తమం. ఉత్తరం లేదా ఈశాన్యంలో కిటికీ వద్ద కూడా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు.

13. ఉత్తరం, తూర్పు దిశలో తలుపులు, కిటికీలు.. పడమర, దక్షిణ దిశల కంటే పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి.

14. దక్షిణ, పడమర గోడలకు ఆనుకొని భారీ ఫర్నిచర్ ఉంచితే మేలు. గోడ గడియారాలు ఎప్పుడూ పని చేస్తూ ఉండేలా చూసుకోవాలి.

Read Also : Blood: ఏ వయసు వారిలో ఎంత రక్తం ఉండాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు