వాస్తు నియమాలు ఇంటిని నిర్మించుకోవడానికి, ఇంట్లో వస్తువుల అమరిక, బెడ్రూమ్, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలనే దానికే పాటిస్తుంటారు. కానీ వాహనాల పార్కింగ్ (Vehicle Parking Vastu) విషయంలోనూ వాస్తు సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాహనాలు ప్రమాదానికి గురి కాకుండా ఉంటాయట. ప్రస్తుత సమాజంలో చాలా మంది కార్లు, బైక్ లు కొని వాడుతున్నారు. అయితే, వాటిని పార్కింగ్ (Vehicle Parking Vastu) చేయడం కూడా చాలా మందికి సమస్యే. కొందరు రోడ్డు పైనే పెట్టేస్తుంటారు. మరికొందరు పార్కింగ్ కు (Vehicle Parking Vastu) ఇంటి ముందు స్థలం కేటాయిస్తుంటారు.
1. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిక్కులో మీ సొంత బైకులు, కార్లు పార్కింగ్ చేస్తే అలాంటి వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయట.
2. తప్పుడు డైరెక్షన్ లో వాహనం పార్కింగ్ చేస్తే మానసిక ఒత్తిడి కలుగుతుందని చెబుతున్నారు. ప్రమాదాలు, భౌతికంగా నష్టాలు కూడా సంభవిస్తాయి. లేదా నిరంతరం వాహనం రిపేర్లకు వస్తూ ఉంటుంది.
3. వాహనాల పార్కింగ్ కు తూర్పు లేదా ఉత్తర దిశ అనువైనదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే, ఇక్కడ ఓ జాగ్రత్త పాటించాలి.
4. కొందరు ఇంటి ముందు షెడ్లు, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మెయిన్ గేట్ కంటే తక్కువ హైట్ లో పార్కింగ్ షెడ్ల హైట్ ఉంటే మంచిదని చెబుతున్నారు.
5. మెయిన్ గేటు కంటే ఎక్కువు ఎత్తులో ఉంటే ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందట.
6. ఇంటికి నైరుతి భాగంలో వరండా ఉంటే అక్కడ కార్లను పార్కింగ్ చేయవచ్చు. ఇలా చేయడం శుభప్రదం.
7. వెహికల్ ముందు భాగం దక్షిణం వైపు ఉండేలా పార్క్ చేయరాదు. ఈశాన్య భాగంలో పార్కింగ్ చేస్తే ఆర్థిక నష్టం తప్పదట. మానసిక ఒత్తిడినీ సూచిస్తుంది.
మామిడి తోరణాలు ఎలా కట్టాలి?
1. పర్వదినాల సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం తోరణాలు కట్టడం ఆనవాయితీ. హిందువుల ముఖ్య పండగలన్నింటినీ వైభవంగా జరుపుకుంటారు.
2. పండగల సందర్భంగా గుమ్మానికి మామిడి తోరణాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఇలా చేయడం శుభసూచకంగా భావిస్తారు.
3. అలాగే ఇంట్లో జరిగే శుభకార్యాలు, వేడుకలకూ మామిడి తోరణాలు మస్ట్ గా వాడతారు. తోరణాలు కడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలియదు.
4. మామిడి తోరణాలు కట్టడం వల్ల శుభసూచకంతో పాటు సైంటిఫిక్ గా మంచి కారణాలు కూడా ఉన్నాయి.
5. నిద్రలేమితో బాధపడుతుంటే అలాంటి సమస్యలు దూరం కావడానికి గుమ్మంలో కట్టే మామిడి తోరణాలు ఉపకరిస్తాయి.
6. తీవ్రమైన శ్రమ, పని ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. కోరికలు నెరవేరాలన్నా మామిడి తోరణాలు సహకరిస్తాయట.
7. పలు అనారోగ్యాలను పారదోలడానికి ఆయుర్వేద వైద్యంలో కూడా మామిడాకులు వాడతారు.
8. మామిడాకుల్లో ఆక్సిజన్ ఉంటుంది. ఇంట్లోకి శుభ్రమైన గాలి వీచేందుకు ఇవి ఉపకరిస్తాయి. తద్వారా చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.
9. ఇంట్లో వాస్తు దోషాలు పోగొట్టడానికి కూడా మామిడాకులు పనిచేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
10. గుమ్మానికి మామిడాకులు కట్టడం వల్ల సకల శుభప్రదంగా భావిస్తారు.
11. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. మామిడాకులతో తయారు చేసిన తోరణాలు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల సాక్షాత్తూ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందని భావిస్తారు.
12. ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా అడ్డుకొనే శక్తి మామిడాకులకు ఉందని నమ్ముతారు.
13. గుమ్మాలకు మామిడాకులు కట్టడం ద్వారా ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు.
14. అందుకే దేవాలయాల్లోనూ మామిడాకులతో తోరణాలు కట్టి దేవతానుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు.
Read Also : Lights In House: ఇంట్లో ఎలాంటి లైట్లు వేసుకోవాలి.. వాస్తు శాస్త్రంలో ఏముంది?
