Vruschika Rasi 2025: నూతన సంవత్సరం 2025లో వృశ్చిక రాశి ఫలితాలు చూస్తే స్త్రీలకు కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు అధికమయ్యే సూచనలు గోచరిస్తున్నాయంటున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది అర్ధాష్టమ శని వెళ్లిపోతోందని, అందువల్ల మంచి ఫలితాలు కలుగుతాయని వివరిస్తున్నారు. (Vruschika Rasi 2025)
వృశ్చిక రాశి ఫలితాలు 2025
విశాఖ 4వ పాదం
అనురాధ 1, 2, 3, 4 పాదాలు
జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
ఈ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు
ఆదాయం 2
వ్యయం 14
రాజపూజ్యం 5
అవమానం 2
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉండబోతోంది. రెండు రూపాయలు ఆదాయం వస్తే 14 రూపాయలు ఖర్చు ఉండబోతోంది. ఖర్చును దుబారాగా చేస్తారు. ఇది తప్ప అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని వెళ్లిపోతోబోతోంది. ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది.
మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సంబంధించి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. బాగా డబ్బు సంపాదిస్తారు. రెండు మూడు రూపాలుగా ఆదాయం కనిపిస్తోంది. కాకపోతే మీరు నమ్ముకున్న వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరినైతే నమ్ముకుని కాన్ఫిడెంట్ గా ఉంటారో ఓవర్ గా మారినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారని అనుకున్న వారు మిమ్మల్ని రోడ్డుపైన వదిలేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.
ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు బొటిక్, సెలూన్ రంగాల్లో కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే అనుకూలంగా ఉంది. అవివాహిత స్త్రీలకు వివాహయోగం, సంతానం లేని వారికి సంతాన యోగం సూచనలు. ఉద్యోగులకు, ట్రాన్స్ ఫర్లు కోరుకున్న వారికి, ట్రాన్స్ ఫర్లు. ప్రమోషన్లు, పై అధికారుల మన్ననలు ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది.
విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువు, విద్య, ఉద్యోగం విషయంలో అనుకూలం. విదేశీ వీసాలు వస్తాయి. చదువుకున్న వారికి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి.
రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి. దిగుబడి, రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలం. మీ శత్రువులు కూడా మిత్రులై సహకరిస్తారు. మీరు పోటీ చేసిన స్థానం నుంచి గెలుపు కనిపిస్తోంది. నామినేటెడ్ పదవదులైనా లభించే అవకాశం.
అర్ధాష్టమ శని వెళ్లిపోతుండడంతో చాలా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, రైతులు, కళాకారులకు, అందరికీ అనుకూలంగా ఉంది.
ఇవీ చదవండి: Tula Rasi 2025: తులా రాశి 2025 ఫలితాలు.. 100కు 100 మార్కులు!
Kanya Rasi 2025: కన్య రాశి 2025 ఫలితాలు.. ఏప్రిల్, మే తప్ప మిగతా అనుకూలమే!
Vrushabha rasi: వృషభరాశి 2025 ఫలితాలు.. పట్టిందల్లా బంగారమే!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు
