కొందరు అబ్బాయిలు ఎవరినైనా ప్రేమిస్తే (Love sign) కాస్త హానెస్ట్‌గానే ఉంటుంటారు. తమ ప్రేయసిని ఇంట్లో కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంటారు చాలా మంది. ఇష్టమైన ప్రదేశాలకు తీసుకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మగువ మనసులో మగవారు స్థానం సుస్థిరం (Love sign) చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు ప్రేమించడం మొదలు పెడితే వారిలో కొన్ని లక్షణాలు (Love sign) కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేసిన అబ్బాయికి కాస్త లోకం కొత్తగా కనిపిస్తుంది. అమ్మాయిని చాలా మృదువుగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ప్రేమను తన చేష్టల ద్వారా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కళ్ల ద్వారా ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాగే, ఇష్టపడిన అమ్మాయి కోసం ప్రాధాన్యతలు మార్చుకుంటూ ఉంటారట అబ్బాయిలు.
అబ్బాయి ఓ అమ్మాయిని ఇష్టపడటం ప్రారంభిస్తే.. అమ్మాయి ఏది చెప్పినా కాస్త శ్రద్ధగా వింటుంటాడని చెబుతున్నారు. తాను ఇష్టపడుతున్న అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. అలాగే అమ్మాయి ఇష్టాయిష్టాలను గౌరవిస్తాడని చెబుతున్నారు. అభిప్రాయాలను కూలంకషంగా విని తెలుసుకుంటారు. మరోవైపు ప్రేమించిన అమ్మాయిపై ఎవరైనా జోకులు వేస్తే అస్సలు సహించరట.
వాస్తవానికి పురుషులు ఎప్పుడూ తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయరట. వారు సాధారణంగా తమ ప్రేమను లేదా భావాలను చాలా మంది గుర్తించని సూక్ష్మ మార్గాల్లో చూపిస్తారని అధ్యయనాల్లోనూ తేలింది. ఈ అబ్బాయిలు ప్రేమలో పడినప్పుడు చేసే చేష్టలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడో అనేక అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. మనం ఇష్టపడే వ్యక్తి చెప్పే దాని గురించి శ్రద్ధ వహించడం ప్రారంభిస్తాడట. అలాగే, ఏ కేఫ్‌కి వెళ్లాలో కాకుండా ఇతర విషయాలపై వారి అభిప్రాయాలను అడిగినప్పుడు ప్రేమలో ఉన్నాడా లేదా అనేతి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు పక్కన ఉన్నప్పుడు అబ్బాయిలు కాన్సన్‌ట్రేట్ ఎక్కువ చేస్తారట.
ఇష్టపడే అమ్మాయి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరట. వారి ప్రవర్తనలో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. అమ్మాయితో ఎక్కువ సమయం మాట్లాడాలని, కలిసి తిరగాలని కోరుకుంటారు. ప్రతి క్షణం వారు తమ కోసం ఏమి చేయగలరో ఆలోచిస్తారు. కుర్రాళ్లు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, వారు కారణం లేకుండా అమ్మాయికి బహుమతులు ఇస్తారి అనేక అధ్యయనాల్లో సైతం తేలింది. స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, బట్టలు మొదలైన ప్రతి విషయంలోనూ వారే శ్రద్ధ వహిస్తారట. అమ్మాయి జీవితంలో ఏం జరుగుతోందో అను నిత్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
Read Also : Lazy: శరీరం బద్ధకంగా ఉందా? ఇలా దూరం చేసుకోండి..