మంగళవారం, 22 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Tollywood : 17 ఏళ్లకే ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి… కానీ జీవితంలో ఆ ఒక్క విషయం మాత్రం బాధగా మిగిలిందని చెప్పిన సీరియల్ నటి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 30 నవంబర్ 2025

Tollywood : సినీరంగంలో ప్రేమ, పెళ్లి ఇప్పుడు సాధారణమే. బుల్లితెర నటీనటులూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అయితే అప్పట్లో అలాంటివి పెద్ద వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలోనే తన కుటుంబాన్ని వదిలిపెట్టి, కేవలం 17 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నటి శ్రీవాణి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా పరిచయం ఉన్న శ్రీవాణి, ఇప్పటికీ పలు షోలు, కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆమె భర్త విక్రమాదిత్య సినిమాల్లో నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

ఇంటర్వ్యూలో శ్రీవాణి మాట్లాడుతూ—
“17 ఏళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయి విక్రమ్‌ను పెళ్లి చేసుకున్నాను. ఇండస్ట్రీలోకి రావడానికే కారణం కూడా ఆయనే. ఈవెంట్లలో డ్యాన్సర్‌గా వెళ్లినప్పుడు యాంకరింగ్ కూడా చేయించేవాళ్లు. ఆయనతో ఉంటే చాలు అనిపించేది. ఎక్కువ ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా” అని చెప్పింది.

అయితే ఒక విషయంలో మాత్రం ఆమెకు ఇప్పటికీ బాధ మిగిలిందట.
“పెళ్లి కోసం చదువు మధ్యలోనే వదిలేశాను. చదువు పూర్తిచేసి ఉండుంటే బాగుండేదనిపిస్తుంది. అదే నా జీవితంలో ఒక్క రిగ్రెట్. అందుకే నా కూతురికి ఏం చేయాలని అనిపిస్తే అది చేసుకోనీ… కానీ చదువు మాత్రం తప్పనిసరిగా పూర్తిచేయాలని చూస్తున్నా” అని చెప్పింది.

శ్రీవాణి కూతురు రాజనందిని ప్రస్తుతం ‘ఢీ’ షోలో డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా శ్రీవాణి తరచూ కుటుంబ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

View this post on Instagram

ఇవీ చదవండి: Vishal Dhanshika : విశాల్ ధన్సిక.. ప్రేమ నుంచి పెళ్లి దాకా..
Brides Feet : పెళ్లి సమయంలో వధువుకు కాళ్ల పారాణి ఎందుకు పెడతారు? — ఆచారంలో ఉన్న ఆధ్యాత్మికం, శాస్త్రం, భావన

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading