Rahul Gandhi : కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. రాహుల్‌పై అనర్హత వేటు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) పెద్ద షాక్‌ ఇచ్చింది కేంద్రం. ఎంపీ రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు వేస్తూ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు లోక్‌ సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో మరుసటి రోజే లోక్‌సభ సచివాలయం ఈ చర్యలు తీసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఆ సందర్భంగా దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో.. అని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు రాహుల్‌.

ఈ వ్యాఖ్యలను తప్పు పట్టిన బీజేపీ గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ.. సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు సుమారు నాలుగేళ్ల తర్వాత దీనిపై తీర్పు వెల్లడించింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాంతోపాటు పై కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. ఇక ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడితే.. అలాంటి వారికి ప్రజా ప్రతినిధిగా కొనసాగే హక్కు ఉండదని చట్టం చెబుతోంది.

ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌ సభ సచివాలయం రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి.. తీర్పు ఇచ్చిన తేదీ నుంచి రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగేందుకు అర్హత ఉండదు. కారాగార శిక్షతో పాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అర్హత ఉండదు. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలిన తర్వాత అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళలోని వయనాడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆర్టికల్‌ 102(1)(ఇ)లోని రూల్స్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ దోషిగా తేలిన తేదీ అంటే మార్చి 23వ తేదీ నుంచి అనర్హుడైనట్లుగా లోక్‌సభ సచివాలయం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నోటిషికేషన్‌లో లోక్‌సభ సచివాలయం పేర్కొంది. అయితే, దీనిపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు. ప్రతిపక్షమే ఉండకూడదనే దురుద్దేశం మోదీ ప్రభుత్వానికి ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్‌తో సంప్రదించిన తర్వాతే అనర్హత వేటు వేయాల్సి ఉంటుందని, నేరుగా లోక్‌సభ సచివాలయం ఇలాంటి పని చేయరాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ తెలిపారు.

Also Read : MLC Elections : క్రాస్‌ ఓటింగ్‌తో టీడీపీ అభ్యర్థి గెలుపు.. ఎమ్మెల్యేల కదలికల్ని వైసీపీ గుర్తించలేకపోయిందా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles