తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు జోరుగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఎవరికి వారే ఎమునాతీరే అన్న చందంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే, ఎన్నికలు సమీపించే నాటికి పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. తాజాగా సరికొత్త పొత్తు అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే వైఎస్సార్‌టీపీ, కాంగ్రెస్ (Congress) పొత్తు. రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్సార్ తనయ షర్మిల (YS Sharmila) పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి (CM KCR) కేసీఆర్‌పైన, మంత్రి కేటీఆర్ (KTR) సహా కేబినెట్ మంత్రులపై షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు షర్మిల. ఇందులో భాగంగానే కాంట్రవర్సీ వ్యాఖ్యలు, కేసులు, కోర్టు మెట్లెక్కడం లాంటివి చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా షర్మిల దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా శత్రువులు, మిత్రులు ఉండరని చెబుతారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి దూరమైన వైఎస్ కుటుంబం.. తాజాగా హస్తం పార్టీతో దోస్తీ చేసేందుకు సిద్ధమవుతోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన సోదరుడిపై కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల కలిసి పని చేస్తారా? అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలకు షర్మిల లేఖ రాశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జనసమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మాఆర్పీఎస్ లతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాలన్నారు.
ప్రభుత్వంపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాలని చెప్పారు. 1,200 మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.
నిరుద్యోగం సమస్యపై కలిసి పనిచేద్దామంటూ షర్మిల తమకు ఫోన్ చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం చేస్తున్న పార్టీలతో తాము సమదూరమని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. అలాంటి పార్టీలతో షర్మిల చెప్పినట్లు కలిసి వేదిక పంచుకోలేమని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం దూరమైంది. తన సోదరుడిపై కేసులు పెట్టించిన పార్టీతో అప్పడు పాదయాత్ర ద్వారా షర్మిల పోరాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. అవన్నీ ఇప్పుడు మరిచిపోయి తన సోదరుడు వైఎస్ జగన్‌పై కేసులు పెట్టించిన పార్టీతో సోదరి స్నేహం చేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. రేవంత్ చెప్పినట్లు వీరి కలయికకు బీజేపీకి అడ్డంకిగా మారుతుందా? బీజేపీకి దూరం జరిగి.. షర్మిల ఒక్కరే ఫైట్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. ఇలా వైఎస్సార్‌టీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపై ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Rahul Gandhi : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాహుల్‌పై అనర్హత వేటు!
[…] […]