ఎసిడిటీ (Acidity) సమస్య మనలో చాలా మందిని బాధిస్తుంటుంది. ఆఫీసుల్లో పని చేసుకొనే వారు, ఇంట్లో మహిళలూ ఈ ఇబ్బందితో సతమతమవుతుంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వారికి ఛాతిలో మంట, నొప్పితో ఏ పని చేయాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి ఎసిడిటీ (Acidity) నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి..
1. అసలు ఎసిడిటీ ఎందుకు వస్తుందో మొదట అందరూ తెలుసుకోవాలి.
2. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం పనిలో నిమగ్నం అయిపోవడం చాలా మంది చేస్తుంటారు.
3. ఎసిడిటీ అటాక్ చేయడానికి ఇదే మొదటి కారణం అవుతుంది.
4. దీని తర్వాత కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ లాంటివి కూడా ఎసిడిటీకి కారణమని వైద్యులు చెబుతున్నారు.
5. ఇలాంటివన్నీ చేయడం వల్ల మన శరీరంలో ఆమ్లాల స్థాయి బాగా పెరిగిపోతుంది.
6. దీంతో గుండెల్లో మంట మాదిరిగా అనిపిస్తుంది. యాసిడ్స్ రిఫ్లక్స్ అవుతాయి.
7. మనం తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేది హైడ్రోక్లోరిన్.
8. ఇది డీఫాల్ట్ గా మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. జీర్ణ క్రియను పూర్తి చేయడానికి ఇది దోహదం చేస్తుంది.
9. డీహైడ్రేషన్, ఎక్కువగా మద్యం సేవించడం, తీవ్రమైన ఒత్తిడి, స్మోకింగ్ లాంటి వాటి వల్ల ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. దీని వల్లే ఎసిడిటీ సమస్య వస్తుంది.
10. పుల్లని త్రేన్పులు, కడుపు, గొంతులో మంట, మలబద్ధకం, వికారం, వాంతులు, వెక్కిళ్లు రావడం, అలసిపోతున్నట్లు అనిపించడం లాంటివి ఎసిడిటీ లక్షణాలుగా చెప్పొచ్చు.
11. దీని నివారణకు తులసి ఆకులు వాడవచ్చు. నాలుగైదు తులసి ఆకులు నీటిలో వేసుకొని మరిగించి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
12. సోంపూ కూడా ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.
13. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలోనూ శోషణ పెంచే శక్తి ఉంది.
14. మజ్జిగను కొత్తమీర ఆకులు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గిస్తుంది.
15. బెల్లం తీసుకుంటే మెగ్నీషియం ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంటుంది.
Also Read : Rahul Gandhi : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాహుల్‌పై అనర్హత వేటు!