శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Stock Market: భారత మార్కెట్లు ఢమాల్.. ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్ల ఆవిరి!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 5 ఆగస్టు 2024

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) సూచీలు ఇవాళ భారీగా నష్టాలను చవిచూశాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 2,400 పాయింట్లు నష్టంతో మొదలైంది. ఇక నిఫ్టీ కూడా 24,300 దిగువన ఆరంభమైంది. దీంతో ట్రేడింగ్‌ మొదట్లోనే మదుపర్ల సంపద సుమారు రూ.14 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. సెన్సెక్స్‌ 30లో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు తప్ప మిగతా అన్నీ నష్టాల్లోనే కొనసాగాయి.

కారణాలేంటంటే..
అగ్రరాజ్యం యూస్ లో గడచిన జూలై మాసంలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే భారీగా తగ్గింది. దీంతో మాంద్యం వస్తుందనే భయాలు మొదలయ్యాయి. వ్యవసాయేతర రంగాల్లో గత నెలలో 1.14 లక్షల ఉద్యోగాలే నమోదైనట్లు అక్కడి కార్మిక శాఖ పేర్కొంది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని అంచనా కట్టారు. జనాభా వృద్ధికి అనుగుణంగా జాబ్ అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఆ సంఖ్య చాలా అడుగున ఉంది. ఈ కారణంగా మాంద్యం వస్తుందన్న భయాలు ఏర్పడ్డాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకోవడం కూడా కలవరపెడుతోంది.

ఇక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో ఎప్పుడు భగ్గుమంటుందోనని మార్కెట్లలో గుబులు రేగుతోంది. సోమవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ జీ7 దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. చమురుకు ప్రసిద్ధి చెందిన పశ్చిమాసియాలో ఏర్పడిన ఈ ఘర్షణ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

నిరాశ మిగిల్చిన త్రైమాసిక ఫలితాలు
నేటి వరకు రిలీజ్ అయిన వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలన్నీ మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. కానీ, ఎక్కడా మార్కెట్లను ఉత్తేజరపరిచేలా గొప్ప వార్తలు వెలువడకపోవడం కూడా ప్రస్తుతం మార్కెట్ డౌన్ కావడానికి కారణాలుగా చెప్పొచ్చు.

ఇవీ చదవండి: Virat Kohli Assets: కింగ్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఇదే.. స్టాక్‌ గ్రో వెల్లడించిన ఆసక్తికర విశేషాలు
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Surya Kumar Yadav: స్కై ఈజ్‌ ద లిమిట్‌.. మార్కెట్లోనూ దంచేస్తున్న సూర్యకుమార్ యాదవ్
PhonePe: ఫోన్ పేలో రిఫరల్ ప్రోగ్రామ్ గురించి తెలుసా?
Black Rice: బ్లాక్ రైస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మీకు తెలుసా?

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading