HomeBusinessPhonePe: ఫోన్ పేలో రిఫరల్ ప్రోగ్రామ్ గురించి తెలుసా?

PhonePe: ఫోన్ పేలో రిఫరల్ ప్రోగ్రామ్ గురించి తెలుసా?

PhonePe: యూపీఐ పేమెంట్స్ దిగ్గజ సంస్థ ఫోన్ పే ఇటీవల కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఫోన్ పే పేమెంట్ గేట్ వే ద్వారా రిఫరల్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఆన్ లైన్ వేదికగా బిజినెస్ వృద్ధికి సాయపడే వారి కోసం ఫోన్ పే సంస్థ పీజీ పార్ట్ నర్ కార్యక్రమాన్ని తయారు చేసింది. రిఫరల్ భాగస్వామిగా ఉన్న పర్సన్, తన క్లయింట్లను కాంటాక్ట్ అయ్యి, కస్టమర్ల నుంచి ఆన్ లైన్ పేమెంట్లను తీసుకుని బిజినెస్ వృద్ధిని పెంచుకోవచ్చని వారికి సూచించవచ్చు.

ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే అండ్ ఆన్‌లైన్ మర్చంట్స్ హెడ్ అంకిత్ గౌర్ మాట్లాడారు. అత్యాధునిక పేమెంట్ పరిష్కారాలు, రివార్డింగ్ పార్ట్‌నర్‌షిప్‌లను అందిస్తూ, బిజినెస్‌లకు సాధికారతను కల్పించడం కోసం తాము అంకితభావంతో పనిచేస్తున్నాన్నారు. ఈ విషయాన్ని ఫోన్‌పే పీజీ పార్ట్ నర్ ప్రోగ్రామ్‌ ప్రారంభంతో మరోసారి స్పష్టం చేశామన్నారు.

తమ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినప్పటి నుంచి, ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఈ చొరవతో, మర్చంట్లకు తమ ఆన్‌లైన్ బిజినెస్ విజయావకాశాన్ని మెరుగుపరచడం కోసం అత్యాధునిక ఫిన్‌టెక్ పరిష్కారాలు, ఆఫర్లను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి: AP Govt Schemes: సంక్షేమ పథకాలు ఆపేయడం కూడా మంచిదేనా?!
The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!
Find My Device: నెట్‌వర్క్‌ లేకున్నా, బ్యాటరీ డెడ్‌ అయినా మీ ఫోన్‌ను కనిపెట్టొచ్చు! ఫైండ్‌ మై డివైజ్‌ అప్‌గ్రేడ్‌..!
Google Pay: మీ ఫోన్‌ పోయిందా? పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే ఎలా వాడాలంటే..!
Realme 12+ 5G: ఇండియా మార్కెట్‌లోకి రియల్‌ మీ 12 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు