HomeAndhra PradeshChandrababu dubaara: చంద్రబాబు రూ.6 వేల కోట్ల దుబారా కనిపించదు.. జగన్‌ సొంత ఖర్చులతో వెళ్లినా...

Chandrababu dubaara: చంద్రబాబు రూ.6 వేల కోట్ల దుబారా కనిపించదు.. జగన్‌ సొంత ఖర్చులతో వెళ్లినా ఎల్లో మీడియా దుష్ప్రచారమే!

Chandrababu dubaara: చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా సుమారు 6 వేల కోట్లకుపైగా ప్రజాధనం దుబారా చేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఇందుకు ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టకున్నారు. ఇదే కాదు.. గతంలో ఎప్పుడూ విదేశీ పర్యటనలకు వెళ్లినా జగన్‌ సొంత డబ్బులే పెట్టుకుంటూ వస్తున్నారు. ఖజానాకు పైసా భారం మోపలేదు. అయితే, దీనిపై ఎల్లో మీడియా వాదన మరోలా ఉంది. (Chandrababu dubaara)

సీఎం జగన్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను ఎలాగైనా తగ్గించాలి.. అందుకోసం రోజూ తమ ఎల్లో మీడియాలూ అబద్ధాలూ, అభూత కల్పనలూ రాయాలి, చూపించాలి.. ఇంకా అవసరమైతే జగన్‌ వ్యక్తిత్వ హననానికి పూనుకోవాలి… ఇదీ ఎల్లో మీడియా దుర్మార్గపు ఆలోచన. ఈ కోవలోనే ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల లండన్‌ పర్యటనకు సొంత ఖర్చులతో వెళ్తే.. దానిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం మొదలు పెట్టింది.

ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారంటూ ఢంకా బజాయిస్తోంది. గతంలో చంద్రబాబు, లోకేష్‌ వందల కోట్లు దుబారా చేస్తే ఆ దుబారాను కనిపించకుండా దాచేసిన పచ్చమీడియా.. ఇప్పుడు జగన్‌పై దుర్మార్గపు రాతలు రాస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడిస్తూ పచ్చమీడియా బట్టలిప్పి నడిరోడ్డుపై నిలబెడుతున్నా సరే.. తమ వైఖరి మార్చుకోవడం లేదు.

సీఎం వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని మరోసారి రుజువైంది. పేదల పక్షాన నిలుస్తున్న మనసున్న ముఖ్యమంత్రిపై పదే పదే అసత్య ప్రచారాలు, అభాండాలు, అవాస్తవాలను పచ్చ టీవీల్లో ప్రసారం చేస్తూ, పచ్చ పత్రికల్లో అచ్చేస్తూ ఎల్లో మీడియా పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. తాజాగా సీఎం వైయస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై ఇదే వైఖరి అవలంబించింది.

‘అయ్యో.. దారుణం జరిగిపోతోంది.. పేదల పక్షపాతి జగన్‌ ఛార్టర్డ్‌ విమానంలో లండన్‌కు వెళ్లారు’ అంటూ ఎల్లో మీడియా మళ్లీ అబద్ధాలు ఏకరువు పెట్టింది. తన సొంత ఖర్చులతోనే జగన్‌ పర్యటన సీఎం జగన్‌ తన సొంత ఖర్చులతోనే లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈ ఒక్కటే కాదు.. ఇంతకు ముందు కూడా ఆయన తన పర్యటనలకు రూపాయి కూడా ప్రజాధనం వెచ్చించింది లేదు. గతంలో ఆయన అమెరికా పర్యటన గానీ, ఇజ్రాయెల్, లండన్‌ పర్యటనలు గానీ అన్నీ ఆయన తన సొంత డబ్బుతోనే చేశారు.

ఖజానా నిధులు సద్వినియోగం చేస్తూ.. ప్రతి పైసా కూడా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పేద వర్గాలకు చేరవేసే ఆలోచన సీఎం జగన్‌ది. కానీ దోచుకో.. పంచుకో.. తినుకో.. ఆలోచన ఉన్న దుష్టచతుష్టయం.. తమ హయాంలో జరిగినట్టే, తాము చేసినట్టే అందరూ చేస్తారనుకుని.. పచ్చకామెర్ల కళ్లతోనే చూస్తూ.. పచ్చి అబద్ధాలు రాస్తున్నారు.

చంద్రబాబు దుబారా దాచేసిన ఎల్లో మీడియా

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేసిన దుబారా అంతా ఇంతా కాదు. నిస్సిగ్గుగా ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా తమ బినామీలకు పంచి పెట్టడమే కాదు.. తమ కార్యక్రమాలు, పర్యటనల్లోనూ అవసరానికి మించి ఖర్చు చేసేవారు. వీటిని ఎల్లో మీడియా కూడా ప్రజలకు తెలియనిచ్చేది కాదు. చంద్రబాబు తన కుటుంబ విలాసాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేశారన్నది అందరికీ తెలిసిందే.

చంద్రబాబు దుబారాలో మచ్చుకు కొన్ని..

  • పోలవరం కట్టకపోయినా.. పోలవరంలో కాంట్రాక్టులు తమవాళ్లకు ఇప్పించుకుని వేల కోట్లు దండుకున్నారు. అక్కడితో ఆయన ధనకాంక్ష తీరలేదు. టూర్ల పేరిట తన వర్గీయులు, టీడీపీ నేతలు, కార్యకర్తలను బస్సుల్లో తిప్పి వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు.
  • అమరావతి గ్రాఫిక్స్‌ కోసం కోట్లాది రూపాయలు దుబారా చేయించిన చంద్రబాబు అంతటితో ఆగకుండా… లేని అమరావతిని చూపించేందుకు కార్యకర్తలను బస్సుల్లో తిప్పి ఖజానాకు కోట్లాది రూపాయలు చిల్లు పెట్టాడు.
  • ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో సిగ్గూ ఎగ్గూ లేకుండా… జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.52 కోట్లు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు.
  • విదేశీ పర్యటనల పేరిట ప్రత్యేక విమానాల్లో షికారు చేసేందుకు సుమారు రూ.100 కోట్ల పైనే దుబారా చేశారు.
  • లేక్‌వ్యూ అతిథిగృహం కోసం రూ.9.50 కోట్లు దుబారా.
  • ఫర్నిచర్‌ కోసం రూ.10 కోట్లు, తన ఫాం హౌస్‌ కోసం రూ.4.50 కోట్లు ఖజానాపై భారం.
  • హైదరాబాద్‌లో ఎల్‌ బ్లాక్‌ మరమ్మతుల కోసం రూ.14.30 కోట్లు దుబారా చేసిన బాబు.
  • హైదరాబాద్‌లో ఉండగా సీఎం క్యాంప్‌ కార్యాలయ మరమ్మతుల కోసం రూ.6.90 కోట్లు ఖజానా నుంచి తీసుకున్నారు.
  • అమరావతిలో ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ కోసం రూ.42 కోట్లు, తన ప్రత్యేక బస్సు కోసం రూ.5.50 కోట్లు ఖజానా నుంచి ఖాళీ చేశారు.
  • రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం రూ.250 కోట్లు నిస్సిగ్గుగా స్వాహా చేశారు బాబు. మూడు సార్లు కొబ్బరికాయ కొట్టేందుకు రూ.100 కోట్లు తగలేశారు.
  • హైదరాబాద్‌ నుంచి విజయవాడ ప్రయాణానికి రూ.150 కోట్లు వృథా ఖర్చు.
  • రాజధాని నిర్మాణంలో ఒక్క కన్సల్టెన్సీల కోసం రూ.300 కోట్లు ఫట్‌.
  • రాజధాని నిర్మించకపోయినా కనీసం సచివాలయమైనా నిర్మిస్తారని ఆశపడిన ప్రజలను తాత్కాలిక సచివాలయంతో కోలుకోలేని దెబ్బ తీశారు చంద్రబాబు. ఈ టెంపరరీ నిర్మాణానికి ఏకంగా రూ.1,100 కోట్లు ఖర్చుపెట్టారు. పోనీ ఆ నిర్మాణాలేమన్నా బాగున్నాయా అంటే చిన్న వర్షానికే చెరువులు, కారిపోవడాలు. అంతా అవినీతి, ముడుపుల బాగోతం.
  • హైదరాబాద్‌లో పార్క్‌ హయత్‌ హోటల్లో బాబు ఉండేందుకు బాడుగ రూ.30 కోట్లు
  • కృష్ణా, గోదావరి పుష్కరాలకు రూ.3,200 కోట్లు దుబారా చేశారు. ఇంత దుబారా చేసినా ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించారా అంటే అదీ లేదు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నారు బాబు. పుష్కరాల చరిత్రలోనే ఇదో చీకటి అధ్యాయం.
  • హ్యాపీ సండేస్‌ పేరుతో రూ.10 కోట్లు, హ్యాపీ సిటీస్‌ పేరుతో మరో రూ.61 కోట్లు, జన్మభూమి నిర్వహణకు రూ.125 కోట్లు.
  • నవ నిర్మాణ దీక్షల ఖర్చులు రూ.80 కోట్లు, భాగస్వామ్య సదస్సుల ఖర్చు రూ.150 కోట్లు.
  • ఇలా మొత్తం సుమారు రూ.6,000 కోట్లకుపైగా ప్రజాధనాన్ని దుబారా చేసిన చరిత్ర చంద్రబాబుది.

    Read Also : AP CID on CBN: చంద్రబాబు ఐటీ స్కామ్‌పై రంగంలోకి ఏపీ సీఐడీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు