Dhoni – Chahar: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్, ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Dhoni – Chahar) మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తనను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా తయారు చేయడంలో ధోని పాత్ర చాలా ఉందని దీపక్ చాహర్ (Dhoni – Chahar) తాజాగా వ్యాఖ్యానించాడు. ఐదేళ్ల నుంచి సీఎస్కేతో దీపక్ చాహర్ జర్నీ చేస్తున్నాడు. మొదట్లో డెత్ ఓవర్లలో తనకు బౌలింగ్ ఇవ్వలేదని, అయితే, బ్రావో గాయపడటంతో ఓసారి డెత్ ఓవర్లలో బౌలింగ్ చాన్స్ వచ్చిందని దీపక్ చాహర్ వెల్లడించాడు. తనకు 2019 సీజన్ ఎంతో ప్రత్యేకమైందని చాహర్ పేర్కొన్నాడు. ఆ ఏడాది ఐపీఎల్ టోర్నీలో 17 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశానని గుర్తు చేసుకున్నాడు.
2019 సీజన్‌లో పంజబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అవకాశం వచ్చిదని దీపక్ చాహర్ తెలిపాడు. అయితే, ఆ సందర్భంలో ధోని ఆగ్రహానికి గురయ్యానని చెప్పాడు. ఆ తర్వాత అద్భుత బంతులను వేసినందుకు ధోని మెచ్చుకున్నాడని తెలిపాడు. ఆ మ్యాచ్ సందర్భంగా డ్వేన్ బ్రావో గాయపడ్డాడని, దీంతో తనకు డెత్ ఓవర్ వేసే చాన్స్ వచ్చిందన్నాడు. తొలి రెండు బంతులు బీమర్లుగా వేయడంతో ధోని తీవ్రంగా మందలించాడని చాహర్ గుర్తు చేసుకున్నాడు. పంజాబ్ జట్టు ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి వచ్చిందని, వరుసగా రెండు బంతులు బీమర్లుగా వేశానన్నాడు.
ఆ సందర్భంలో కెప్టెన్ ధోని కాస్త కఠినంగా వ్యవహరించి సూచనలు చేశాడని దీపక్ చాహర్ గుర్తు చేసుకున్నాడు. అనంతరం తర్వాత బంతులు క్రమశిక్షణతో వేశానని చెప్పాడు. ఐదు బంతుల్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చానన్నాడు. ఆ సమయంలో క్రీజులో పంజాబ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడని, తాను తొలిసారి డెత్ ఓవర్లలో అవకాశం లభించిందన్నాడు. సాధారణంగా జట్టులో అప్పుడు శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో డెత్ ఓవర్ల బాధ్యత తీసుకొనే వారని తెలిపాడు. బ్రావో గాయపడటంతో మొదటిసారి నాకు డెత్ ఓవర్ వేసేందుకు అవకాశం వచ్చిందన్నాడు.
నెట్స్‌లో నా బౌలింగ్ చూసి ధోనీ అవకాశం ఇచ్చాడని చాహర్ తెలిపాడు. పంజాబ్ ఆ సమయంలో 39 పరుగులు చేయాలని, తొలి బంతిని స్లోగా వేశానన్నాడు. హై ఫుల్‌టాస్‌గా పడిందని, తర్వాత బంతి కూడా ఇలానే వేశానన్నాడు. అప్పుడే ఇక తన పని అయిపోయిందనుకున్నానన్నాడు. ఇకపై తనకు అవకాశాలు రావని అనిపించిందని దీపక్ చాహర్ తెలిపాడు. ఇక డెత్ ఓవర్లలో అవకాశాలు దక్కవని ఫిక్స్ అయిపోయానన్నాడు.
ఆ సమయంలోనే ధోని తన వద్దకు వచ్చి.. ‘నీకు ప్రతిదీ తెలుసు. కాస్త తెలివిగా ప్రవర్తించు. ఇలా ఎందుకు బౌలింగ్ చేస్తున్నావు’ అని కాస్త కఠినంగానే హెచ్చరించాడని దీపక్ చాహర్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడే తాను కాస్త ఆలోచించడం మొదలుపెట్టానన్నాడు. తన కెరీర్‌కే ముగింపు పడుతుందా..? అని భయపడ్డానన్నాడు. తర్వాత ఐదు బంతుల్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చానని, దీంతో మ్యాచ్ అనంతరం తనను మహేంద్ర సింగ్ ధోని హగ్ చేసుకొని అభినందించాడంటూ దీపక్ చాహర్ గుర్తు చేసుకున్నాడు. వరుసగా రెండు బీమర్లు వేసినా కూడా దీపక్ చాహర్‌ను అంపైర్ బౌలింగ్‌కు అనుమతించాడు. ఆ రెండు కూడా స్లో బంతులే కావడం ఇందుకు కారణం అయ్యింది. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 22 పరుగుల తేడాతో విన్ అయ్యింది.
Read Also : MS Dhoni: గవాస్కర్ చొక్కాపై ధోని సంతకం..చెపాక్ క్రౌడ్‌కు మహేంద్రుడి ట్రీట్