MS Dhoni: గవాస్కర్ చొక్కాపై ధోని సంతకం..చెపాక్ క్రౌడ్‌కు మహేంద్రుడి ట్రీట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఎక్కడుంటే అక్కడ అభిమానులు గుమిగూడి పోతుంటారు. తాజాగా ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ కీలక దశకు చేరుకుంది. కీలక మ్యాచ్‌లో సీఎస్కే (CSK) ఓటమిని చవిచూసింది. కేకేఆర్‌తో (CSKvKKR) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది.

ఈ సీజన్‌లో సీఎస్కేకి చెపాక్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులకు ధోని (MS Dhoni) ట్రీట్ ఇచ్చాడు. ధోని (MS Dhoni) జెర్సీలు, బాల్స్‌ను అభిమానులకు స్టేడియంలో నుంచి విసిరాడు. దీంతో అభిమానులకు మరింత పండుగ వాతావరణం ఏర్పడింది.

మ్యాచ్ అనంతరం.. కేకేఆర్ ఆటగాళ్లు కూడా ధోనితో ఆటో గ్రాఫ్ తీసుకున్నారు. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లాంటి వారు ధోని సంతకాలను తమ జెర్సీలపై చేయించుకున్నారు. కేకేఆర్ ప్లేయర్లతో ధోని మాటామంతీ కలిపాడు. అయితే, ఏ మ్యాచ్‌లో అయినా ధోని అపోజిషన్ జట్టు క్రీడాకారులకు సూచనలు ఇవ్వడం కామనే. అయితే, ఈ మ్యాచ్‌లో సరికొత్త సీన్ కనిపించింది. టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)సైతం ధోనికి అభిమానిగా మారిపోయాడు.

ధోని సంతకాన్ని ఏకంగా తన షర్ట్‌పై సునీల్ గవాస్కర్ చేయించుకన్నాడు. దీంతో చెపాక్ క్రౌడ్‌లో మరింత జోష్ కనిపించింది. ఓ దిగ్గజ క్రికెటర్ ఇలా మరో దిగ్గజంతో కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోవడం.. అది కూడా ఏకంగా తన హృదయం వద్ద షర్ట్‌పై సంతకం చేయించుకోవడం గవాస్కర్ సింప్లిసిటీని తెలియజేస్తోందని అభిమానులు మెచ్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏ స్టేడియంలోకి వెళ్లినా అభిమానుల కోలాహలం ఉంటుంది. ధోని బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడంటే ఇక అరుపులే.

హోం గ్రౌండ్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్.. ఇలా స్టేడియం ఏదైనా.. ధోని క్రేజే సపరేట్‌గా ఉంటుంది. ఆయా స్టేడియంలన్నీ ఎల్లో జెర్సీలతో నిండిపోతాయి. భారత్‌లో ఓ క్రికెటర్‌ను ఇంతలా ఆరాధించి, అభిమానించే అరుదైన గౌరవం ఒక్క మహేంద్ర సింగ్ ధోనికే సొంతం అనడంలో సందేహం లేదు. టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ధోని అంటే పడి చచ్చేంత అభిమానం. అనేక వేదికలు, ఇంటర్వ్యూల్లోనూ వీరిద్దరి మధ్యఅనుబంధం గురించి కోహ్లీ చెప్పాడు.

సునీల్ గవాస్కర్ కూడా కామెంట్రీ సెక్షన్‌లో ప్రస్తుత ఐపీఎల్‌లో ఉంటున్నాడు. ధోని క్రేజ్, ఆయన రికార్డుల గురించి ప్రత్యేకంగా గవాస్కర్ చెబుతుంటాడు. టీమిండియాకు 2011 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ఘనత ఒక్క ధోని సొంతం. మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ చిరకాల స్వప్నం అయిన వన్డే వరల్డ్ కప్‌ను అందించి, సగర్వంగా రిటైర్మెంట్ అయ్యేలా చేసిన ఘనత కూడా ధోనిదే.

ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో అనేక మంది యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాడు. భావి కెప్టెన్లను తయారు చేశాడు. మిడిలార్డర్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మను ఓపెనింగ్ లో దింపి, తద్వారా హిట్ మ్యాన్‌గా మారేందుకు అవకాశం కల్పించింది కూడా ధోనినే. విరాట్ కోహ్లీకి కష్టకాలంలో అండగా నిలబడింది కూడా ధోనినే.

Read Also :Surya Kumar Yadav: స్కై ఈజ్‌ ద లిమిట్‌.. మార్కెట్లోనూ దంచేస్తున్న సూర్యకుమార్ యాదవ్

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles