బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Astrology

Shani Jayanti 2026: శని జయంతి 2026: బుధాదిత్య రాజయోగంతో ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభాలు, విజయాలు ఖాయం!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 13 మే 2026

Shani Jayanti 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే బుధాదిత్య రాజయోగం అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటిగా భావిస్తారు. ఈసారి శని జయంతి సందర్భంగా ఈ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం వంటి అనేక అంశాల్లో శుభ ఫలితాలు కనిపించనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మేష, కుంభ, ధనస్సు, కన్యా రాశుల వారికి ఈ యోగం ప్రత్యేక ఫలితాలను ఇవ్వబోతోందట. మరి ఆ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఆర్థిక వృద్ధి
మేష రాశి వారికి శని జయంతి రోజు ఏర్పడుతున్న బుధాదిత్య రాజయోగం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నవారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మహిళలకు బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశమూ ఉంది.

కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది
కుంభ రాశి వారికి ఈ రాజయోగం అనేక శుభ ఫలితాలను అందించబోతోంది. చాలా కాలంగా కష్టపడుతున్న పనులకు ఇప్పుడు ఫలితాలు దక్కే సమయం వచ్చింది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు బలపడతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది. ఆరోగ్య పరంగా కూడా మంచి మార్పులు కనిపిస్తాయి.

ధనస్సు రాశి వారికి అప్పుల నుంచి విముక్తి
ధనస్సు రాశి వారికి బుధాదిత్య రాజయోగం ధనలాభాలను తీసుకురానుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అత్తింటి నుంచి రావాల్సిన సొమ్ము లేదా ఆస్తి సంబంధిత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు.

కన్యా రాశి వారికి ఆరోగ్య లాభం
కన్యా రాశి వారికి శని అమావాస్య రోజున ఏర్పడుతున్న సూర్య-బుధ గ్రహాల కలయిక అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. ఇంట్లో, బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ జీవితంలో కూడా ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు.

బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వ్యక్తికి తెలివితేటలు, ఆర్థిక వృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక గౌరవం పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మంచి అవకాశాలు దక్కుతాయని చెబుతారు.

గమనిక
జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ఆధారంగా ఈ వివరాలు అందించబడినవి. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

ఇవీ చ‌ద‌వండి: Vastu Shastra: వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద పటిక కట్టితే నిజంగా శుభఫలితాలా? ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం
Samudrika Shastra: పాదాల వేళ్లు చెబుతున్న మీ వ్యక్తిత్వ రహస్యాలు.. సముద్రిక శాస్త్రం చెప్పే ఆసక్తికర విషయాలు

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading