శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Sajjala Ramakrishna Reddy: పోలీసుల ఎదుట సజ్జల హాజరు.. ఏమన్నారంటే

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 18 అక్టోబర్ 2024

Sajjala Ramakrishna Reddy: తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వైయస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యారు. (Sajjala Ramakrishna Reddy)

మంగళగిరి రూరల్ పీఎస్ లో సజ్జల విచారణకు హాజరయ్యారు. సజ్జలను డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విచారణ చేశారు. సజ్జల వెంట తనను పంపాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అయితే సజ్జలను మాత్రమే పోలీసులు అనుమతించారు.

టీడీపీ ఆఫీసుపై దాడి చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నిన్న సజ్జలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్ లను పోలీసులు విచారించారు. సజ్జల వెంట పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు.

పొన్నవోలు ఏమన్నారంటే..
మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జలతో పాటు తనను లోపలికి అనుమతించలేదన్నారు. సజ్జలకు 24 వరకూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే.. 10న లుక్ ఔట్ నోటీసు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. దాడి జరిగిన రోజున సజ్జల మంగళగిరికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు కూడా ఇచ్చామన్నారు. పోలీసులకు విచారించే అధికారం ఉన్నట్లు.. నిందితులకు హక్కులున్నాయన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును రకరకాలుగా తిప్పుతున్నారని, దీనిపై మేం న్యాయ పోరాటం చేస్తామన్నారు.

విచారణకు సహకరించలేదు: రూరల్ సీఐ
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించామని మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగామని, చాలా ప్రశ్నలకు గుర్తు లేదనే సమాధానం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో సజ్జల సలహాదారుగా ఉన్నారని, తమ వద్ద ఉన్న ఆధారాలతో సజ్జలను ప్రశ్నించామన్నారు. సజ్జలను ఫోన్ అడిగినా ఇవ్వలేదన్నారు.

’’విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదు. మా ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని చెప్పారు. ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. మూడు నెలలుగా ఈ కేసును విచారించాం. కేసు దర్యాప్తు దాదాపు చివరకు వచ్చింది. చాలామంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారు. దీనివల్ల కేసు విచారణ వేగంగా జరగట్లేదు. నిందితులను అరెస్టు చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుంది. కేసును ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది. ఉత్తర్వులు రాగానే విచారణ దస్త్రాలను సీఐడీకి ఇస్తాం.’’ అని సీఐ వెల్లడించారు.

ఇవీ చదవండి: Sajjala: కక్ష సాధింపు చర్యలు.. వేధింపులు.. రెడ్ బుక్ పాలన
Sajjala Ramakrishna Reddy: కూటమిలో జనసేన, బీజేపీ ఉనికే లేకుండా చేస్తున్న చంద్రబాబు
Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది..
Sajjala on TDP activities: మోసం చేయడంలో కొత్త టెక్నిక్ టీడీపీకి తెలుసు : సజ్జల రామకృష్ణా రెడ్డి

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading