శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

Goa Beach: మీకు తెలుసా? గోవాలో ఆ బీచ్‌కు పోవాలంటే రిజర్వేషన్!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 4 ఆగస్టు 2024

Goa Beach: యువత చాలా మంది సందర్శించాలని కోరుకునే ప్లేస్ లలో గోవా ఒకటి. గోవా టూర్ వెళ్తే అదో సంతృప్తి. అక్కడ బీచ్ లు, పర్యాటక ప్రాంతాలు, ఇతర ఎంజాయ్ మెంట్ వేరే లెవల్. సేద తీరడానికి బెస్ట్ డెస్టినేషన్ గోవా అని చెబుతారు. మనదేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అయితే, గోవాలో పర్యాటకుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో సమస్యలను అరికట్టేందుకు ఉత్తర గోవాలోని కలంగుట్ పంచాయతీలో భిన్నమైన చర్యలు తీసుకుంటున్నారు.

రిజర్వేషన్లు లేకుండా అక్కడికి వచ్చి గ్రామ పరిసరాలను పర్యాటకులు చెత్తగా మారుస్తున్నారన్న ఫిర్యాదులతో ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇందుకోసం వారి నుంచి అదనపు పన్ను వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు.

కలంగుట్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. పబ్లిక్‌ న్యూసెన్స్‌, చెత్త వేయడం, ఇష్టారాజ్యంగా పార్కింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో కుకింగ్ లాంటి చర్యలపై చర్చించారు. అక్కడి గ్రామ సర్పంచ్ దీనిపై స్పందిస్తూ.. పర్యటకులు బృందాలుగా బస్సులు, జీపుల్లో వస్తుంటారని, వారు సముద్ర తీర పరిసరాల్లో మద్యం తాగుతున్నారన్నారు. అక్కడే వాహనాల్లో వంట వండుకుని చెత్తను ఆ గ్రామ పరిసరాల్లో విసిరేస్తున్నారని వివరించారు.

ఇక్కడ ఉండటానికి వారు హోటళ్లలో ఎలాంటి ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవట్లేదన్నారు. అందుకే గ్రామానికి వచ్చే 5 మార్గాల్లో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రిజర్వేషన్లు లేకుండా వచ్చే రోడ్‌ ప్యాసింజర్‌పై అదనపు పన్ను విధించాలని తీర్మానించినట్లు చెప్పారు. వారి బాధ్యతారాహిత్య ప్రవర్తనను నియంత్రించడానికి ఈ తరహా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ జోసఫ్‌ సెకీరియా వెల్లడించారు.పేర్కొన్నారు. పర్యటకులు మద్యం తాగిన సీసాలను ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారని, రోజు మొత్తం అక్కడే వాహనాలను నిలిపి ఉంచడం, పబ్లిక్‌ టాయిలెట్లు వాడుకోవడం వంటివి సమస్యాత్మకంగా తలెత్తాయని తెలిపారు.

విరివిగా చెక్ పోస్టులు..
ఇప్పటికే పర్యటకులు ఆ గ్రామంలోకి వచ్చే 5 మార్గాలను పంచాయతీ సిబ్బంది ఐడెంటిఫై చేశారు. ఈ మార్గాల్లో స్థానిక పోలీసులతో చెక్‌ పోస్టులు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ కు విన్నించుకున్నారు. పంచాయతీ సిబ్బంది కూడా అక్కడ పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి పర్యాటకులు పరిశుభ్రంగా ఉండటం, పరిసరాలను చూసుకోవడం లాంటివి చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని, అపరిశుభ్రత చేస్తేనే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటున్నారు అక్కడి స్థానికులు.

ఇవీ చదవండి: MT Krishna Babu: పర్యావరణంతో ముడిపడిన ప్రజారోగ్యం.. వోన్ హెల్త్ కార్యాచరణతో సవాళ్లను ఎదుర్కోవచ్చు..
Mother child: ఐదేళ్లలో ఏపీలో మాతా శిశు మరణాల రేటు భారీగా తగ్గిపోయింది
Tobacco: పొగాకుతో వచ్చే దుష్పరిణామాలు తెలుసా? తప్పక తెలుసుకోండి
Helicopter: హెలికాప్టర్‌ అద్దెకు తీసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి? ఎంత ఖర్చు?
Food safety: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రతకు రూ.80 కోట్లు

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading