సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Rakul Preet Singh Alert: వాట్సాప్‌లో ఫేక్ నెంబర్‌తో… అభిమానులకు రకుల్ స్పెషల్ హెచ్చరిక!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 25 నవంబర్ 2025

Rakul Preet Singh Alert: సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించబడుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేరును దుర్వినియోగం చేస్తూ, వారి ఫోటోలు వాడి నకిలీ అకౌంట్లు తయారు చేసి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.

కొందరు వ్యక్తులు రకుల్ పేరుతో, ఆమె ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి సందేశాలు పంపిస్తున్నారని ఆమె గమనించింది. 8111067586 నంబర్‌తో రకుల్ ఫోటో, బయోలో ఆమె సినిమాల పేర్లను కూడా వేసి, నిజమైన నెంబర్‌లా ప్రజలకు చాటింగ్ చేస్తున్నారు. దీంతో రకుల్ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో దీనిపై అలర్ట్ ఇచ్చింది.

ఆమె పోస్ట్‌లో ఇలా చెప్పింది:
“హాయ్ ఫ్రెండ్స్… ఎవరో నా పేరుతో వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నారు. దయచేసి గమనించండి – ఇది నా నంబర్ కాదు. ఎలాంటి చాటింగ్ చేయకండి, వెంటనే బ్లాక్ చేయండి.”
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు ప్రముఖులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అదితి రావు హైదరి హెచ్చరిక
నటి అదితి రావు హైదరి కూడా ఇటీవలి కాలంలో ఫేక్ వాట్సాప్ అకౌంట్ల బారిన పడింది. ఆమె ఫోటోను వాడి కొందరు ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు పంపుతుండటంతో ఆమె స్పందిస్తూ:
“నేను ఎవరికీ వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపను. అన్ని అధికారిక సమాచారం నా టీమ్ ద్వారానే వస్తుంది.” అని వెల్లడించింది.

రుక్మిణి వసంత్ కూడా ఇదే పరిస్థితి
‘కాంతార: చాప్టర్ 1’ నటి రుక్మిణి వసంత్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 9445893273 నంబర్ నుండి ఆమె పేరుతో కాల్స్, మెసేజ్‌లు వెళ్లడంతో ఆమె ఫ్యాన్స్‌కు స్పష్టంగా చెప్పింది:
“ఆ నంబర్ నాది కాదు. అలా ఏదైనా కాల్ లేదా మెసేజ్ వస్తే స్పందించకండి.”

సైబర్ మోసాల పెరుగుదల – అభిమానులు జాగ్రత్తగా ఉండాలి
సెలబ్రిటీల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం ప్రస్తుతం సాధారణం అయిపోయింది. ఎవరి నుంచైనా సందేహాస్పద మెసేజ్ వస్తే వెంటనే చెక్ చేసి, అవసరమైతే రిపోర్ట్ & బ్లాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు
Actress : చెమటలు పట్టిస్తున్న టిల్లు భామ.. అందాలు అదరహో!

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading