PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 14వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిధులు జమ చేయనున్నారు. మొదటి విడతతో పోలిస్తే ఏటా రైతుల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం. కేంద్రం 2018 ఫిబ్రవరి ఒకటోతేదీ నుంచి పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ. 2 వేల ప్రకారం మొత్తం రూ.6 వేలు సంవత్సరానికి ఇస్తోంది. (PM Kisan)
ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి విడతలుగా నిధులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. పథకం మొదలు పెట్టినప్పటి నుంచి 13 దఫాలుగా సొమ్ము జమ చేశారు. గత విడతల్లో చాలామందికి నిధులు రాకపోగా మరికొందరికి తమకే చెందిన ఇతర ఖతాల్లో నిధులు జమకాగా ఇంకొందరికి వారి కుటుంబీకుల పేరిటగల బ్యాంకుఖాతాల్లోకి నిధులు చేరాయి. ఈ నేపథ్యంలో 14వ విడతలో లబ్ధిదారుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈకేవైసీ, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ లేనివారికి డబ్బులు జమ కాలేదు. ఈకేవైసీని పూర్తిచేసినా 13వ విడతలో పలువురికి నిధులు రాకపోవటం, ఈకేవైసీ చేయనివారికి నిధులందటం వంటి ఉదంతాలు చాలా జరిగాయి. రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబంలో ఒకరినే పరిగణనలోకి తీసుకోవటం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని పథకంలో నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నారు.
Read Also : Minister Kakani on CBN: చంద్రబాబు, కరువు కవల పిల్లలు.. ఒక్క కరువు మండలం కూడా లేదు..: మంత్రి కాకిణి