Minister Kakani on CBN: చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు మంగళగిరిలో చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన కాకాణి.. నాలుగేళ్లలో సమృద్ధిగా వర్షాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం ప్రకటించే అవసరం రాలేదని స్పష్టం చేశారు. (Minister Kakani on CBN)
అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని మంత్రి కాకాణి గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల బాధ అనుభవించారని, ఆ పరిస్థితులు ఎలా మర్చిపోతారు బాబూ అని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో రైతులకు అన్యాయం జరగనట్టు భ్రమపడుతున్నారన్నారు. రైతుల రుణమాఫీ కోసం ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు.
Read Also : Chandrababu and Lokesh: చంద్రబాబు, లోకేష్‌కు న్యూస్ స్పేస్ తగ్గిపోయిందా? జనసేనాని డామినేషన్ చేస్తున్నారా?
చంద్రబాబు ఉంటేనే వర్షాలు పడుతాయని భ్రమ పడుతున్నారని మంత్రి కాకాణి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కరువు, తాగునీరుకు ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని మంత్రి కాకిణి చెప్పారు. రైతుల కోసం చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.