గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Astrology

Makara Rasi 2025: మకర రాశి ఫలితలు 2025.. కష్టాల కడలి నుంచి గట్టెక్కుతారు!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 31 డిసెంబర్ 2024

Makara Rasi 2025: మకర రాశి వారికి కొత్త సంవత్సరం 2025లో కష్టాలు తీరనున్నాయి. గత పదేళ్లుగా మీరు పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కనున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని స్పష్టీకరిస్తున్నారు. (Makara Rasi 2025)

మకర రాశి ఫలితాలు 2025

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు
శ్రవణం 1, 2, 3, 4 పాదాలు
ధనిష్ట 1, 2 పాదాలు

ఈ సంవత్సరం మకర రాశి జాతకులకు
ఆదాయం 8
వ్యయం 14
రాజపూజ్యం 4
అవమానం 5

గత పది సంవత్సరాల నుంచి మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మకర రాశి వారికి 2025 చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఏలినాటి శని పూర్తి స్థాయిలో వెళ్లిపోతుంది కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఒక రూపాయి రావాల్సిన చోట పది రూపాయలు వస్తాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. పర్సెంటేజీ పెరుగుతుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో ప్లేస్ మెంట్స్ దొరుకుతాయి. సీట్లు వస్తాయి. విదేశాల్లో చదువుకోవడానికి వీసాలు దొరుకుతాయి. విదేశాల్లో చదువుకున్న వారికి పర్మినెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి. వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి.

ఉద్యోగులకు ఈ సంవత్సరం మీరు చేసే జాబ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు ఉంటాయి. ట్రాన్స్ ఫర్లు అవుతాయి. కొత్త ఇల్లుగానీ, స్థలం గానీ కొనుక్కునే అవకాశం.

లాయర్లు, అడ్వొకేట్లు, డాక్టర్లకు అనుకూలం. గత సంవత్సరం కంటే, పదేళ్లకంటే మీరు చేస్తన్న పనిలో లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి.

వ్యవసాయదారులకు రెండు పంటలు బాగుంటాయి. విశేషించి రాబడి పెరుగుతోంది. అప్పులు తీరుస్తారు. అనుకున్న దాని కంటే పది రూపాయలు ఎక్కువగా సంపాదిస్తారు. ఏ పంట వేసినా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కళాకారులు, క్రీడాకారులకు సంబంధించి కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకున్న ప్రాంతల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. రివార్డులు అవార్డులు పొందుతారు.

రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతోంది. చాలా చాలా విశేషించి జనాల్లో మీకు పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. చాలా అనుకూలంగా ఉండబోతోంది. కాకపోతే నరఘోష, నరదృష్టి ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులకంటే మీకు ఎక్కువగా పేరు రావడం వల్ల సమాజంలో లేదా ఆ పార్టీలో నరఘోష వల్ల, దిష్టి వల్ల గొడవలు ఏర్పడు అవకాశం ఉంది. కాబట్టి దిష్టికి ఏదైనా రెమెడీ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది.

ఓవరాల్ గా మకర రాశి వారికి గత 10 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి పూర్తి స్థాయిలో అనుకూలమైన ఫలితాలుంటాయి. వీళ్లకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు.

ఇవీ చదవండి: Dhanusu Rasi 2025: ధనస్సు రాశి 2025 ఫలితాలు.. సంపాదన పెరుగుతుంది!
Vruschika Rasi 2025: వృశ్చిక రాశి 2025 ఫలితాలు.. స్త్రీలకు ఆ విషయాల్లో అనుకూలం!
Simha Rasi 2025: సింహరాశి 2025 ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో వీరికి?
Mithuna Rasi 2025: మిథున రాశి 2025 ఫలితాలు.. మూడేళ్ల కష్టాలకు చెల్లు చీటీ!
2025 Rasi Phalalu: విశ్వావసు నామ సంవత్సరం 2025 రాశి ఫలాలు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading