శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, Crime News

Andhra Crime : నడిరాత్రి వేళ.. కోడలికోసం కాపుగాసిన మామ.. ఏం జరిగిందంటే!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 8 జనవరి 2026

Andhra Crime : ఆంధ్రప్రదేశ్‌లోని Machilipatnam పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మామే తన కోడలిపై కత్తితో దాడి చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగశ్వేత తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

వివరాల ప్రకారం.. మచిలీపట్నం పరాస్‌పేటకు చెందిన ఆకూరి నాగశ్వేతకు వలందపాలెంకు చెందిన వెంకన్నతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదట కొంతకాలం వారి దాంపత్య జీవితం సజావుగానే కొనసాగింది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య, అలాగే రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సమస్యలపై పంచాయితీలు కూడా జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే గొడవలు మరింత ముదిరాయి. దీంతో మామ సోమరాజు కోడలిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ మెడికల్ షాపు ఎదుట పదునైన కత్తితో నాగశ్వేతపై సోమరాజు అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆమెను హత్య చేసేందుకు తలపై బలంగా నరికాడు.

దాడి సమయంలో శ్వేత చేయి అడ్డుపెట్టుకోవడంతో చేతికి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించి సోమరాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన నాగశ్వేతను మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి: Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 – AK47
Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్‌ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..

ట్యాగ్స్: , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading