జీవనశైలి సక్రమంగా కొనసాగాలంటే క్రమం తప్పకుండా మంచి పోషకాహారం (Eating Food) తీసుకోవడం ముఖ్యం. సరైన ఆహారం (Eating Food) తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రోజులో మూడు పూటల తినే (Eating Food) ఆచారం మనకు పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం తిని రోజును ముగిస్తూ ఉంటారు చాలా మంది. అయితే, ఫుడ్ తీసుకోవడానికి సరైన సమయం, మార్గం, ఎన్నిసార్లు తీసుకోవాలనే ప్రశ్నలుచాలా మందిని వేధిస్తూ ఉంటాయి.
1. రోజుకు మూడు పూటల మాత్రమే ఫుడ్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తద్వారా ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.
2. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి దోహదపడుతుందని అంటుంటారు. కొందరు తక్కువ మొత్తంలో రోజుకు 4-5 సార్లు తినడాన్ని లైక్ చేస్తుంటారు. తక్కువ వ్యవధిలో రోజుకు 5 – 6 సార్లు తింటే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుందట.
3. మానవ శరీరానికి ప్రతి రెండు మూడు గంటలకు కాస్త ఫుడ్ అవసరం అవుతుందట. ఈ నేపథ్యంలో మధ్యమధ్యలో తినడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
4. ఒకేసారి తినడానికి బదులుగా చిన్నచిన్నగా విడగొట్టుకొని భోజనం తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది కొవ్వును వేగంగా కరిగించడమే కాకుండా జీవశక్తిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు
5. భాగాలుగా విడగొట్టి తీసుకోవాలన్నారు కదా అని.. రోజుకు 12 గంటల పాటు ఆహారం తీసుకోరాదు. అయితే, ఉపవాసం చేయడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
6. ఉపవాసంతో గ్లైసెమిక్ ప్రక్రియ మెరుగవుతుంది. మరోవైపు ఒక పూట భోజనం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందట.
Weight loss: బరువు తగ్గాలా.. ఈ జ్యూసులను పరగడుపున తాగండి..
బరువు సమస్యతో నేటి సమాజంలో అనేక మంది సతమతమవుతుంటారు. స్లిమ్ గా తయారు కావాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అనేక పద్ధతులు అవలంభిస్తుంటారు. బరువు సమస్యకు జెండర్ తేడా ఏం ఉండదు. ఆడ, మగ.. ఇద్దరికీ ఊబకాయం సమస్యగానే మారుతూ ఉంటుంది. కొందరు బరువు తగ్గేందుకు ఉదయమే వాకింగ్ చేయడం, జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజులు చేయడం, తిండిలో కూడా మార్పులు చేసుకోవడం లాంటివి ప్రయత్నిస్తుంటారు. ఏం చేసినా బరువు మాత్రం తగ్గడం లేదని చెబుతుంటారు.
1. శరీరంలో పేరుకుపోయిన కొవ్వను కరిగించాలంటే ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిస్తుంది.
2. జీర్ణ క్రియ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో పరగడుపునే ఇలాంటి జ్యూస్ తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
3. కొన్ని రకాల పానీయాలను ఉదయం పూట తీసుకుంటే ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పరగడుపున ఏమీ తినకముందే తీసుకోవాలని చెబుతున్నారు.
4. ముఖ్యంగా శరీరం బరువు తగ్గాలంటే శారీరక శ్రమ అవసరం. మరోవైపు తీసుకొనే ఆహారంలోనూ మార్పులు తప్పనిసరి. ఇవి రెండే మనిషి బరువు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
5. వెనిగర్ తీసుకోవడం వల్ల ఊబకాయం ఉన్నవారిలో బరువు, శరీర కొవ్వు పరిమాణం, సీరం ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
6. బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయట. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఖాళీ కడుపుతో తినాలని చెబుతున్నారు. మెంతులు లేదా మెంతి గింజలు నానబెట్టి వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుందని చెబుతున్నారు.
7. వంటకాల్లో వాడే జీరా కూడా బరువు తగ్గించడంలో తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సోంపూ కూడాప్రయత్నించవచ్చు.
Read Also : Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?