Winter Diet: అల్లం మన వంటింట్లో నిత్యం ఉపయోగిస్తుంటాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వంటతో పాటు ఇతర అవసరాలకు అల్లం విరివిగా ఉపయోగిస్తుంటారు. అల్లంలో మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ శీతాకాలం చలిలో వేడిగా, ఘాటుగా ఓ కప్పు అల్లం టీ తాగితే వచ్చే రిలాక్సేషన్ వేరుగా ఉంటుంది. (Winter Diet)
చలికాలంలో చాలా మంది వేడి వేడిగా టీ తాగుతుంటారు. రోజుకు కనీసం ఐదారు సార్లయినా టీ తాగనిదే రోజు గడవదు. మరికొందరు ఆఫీసుల్లో ప్రతి రెండు మూడు గంటలకోసారి టీ తాగితే తప్ప మైండ్ పనిచేయని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో చాలా మంది అల్లం టీ తాగడం అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. అల్లం టీ తాగడం వల్ల ఉపయోగాలు బోలెడు ఉన్నాయి.
పోషకాలకు నెలవు
అల్లంలో చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, కోలిన్ వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు మేలు చేస్తాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషకాలే. అందుకే శీతాకాలంలో అల్లం టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం టీ తాగడం వల్ల ఒత్తిడి, అలసటను అధిగమించవచ్చు. అల్లం నుంచి వచ్చే బలమైన సువాసన, రుచి చాలా రిఫ్రెషింగ్‌ను కలిగిస్తాయి.
ఓ కప్పు అల్లం టీ తాగడం వల్ల సీజనల్‌గా వచ్చే అలర్జీలను కూడా సహజంగానే అరికట్టవచ్చు. సాధారణ జలుబు వల్ల వచ్చే సమస్యలను అల్లం టీ తగ్గిస్తుంది. ఇక మహిళల్లో అయితే నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా అల్లం టీ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీలో టవల్‌ను నానబెట్టి పొత్తికడుపుపై ఉంచితే, అక్కడి కండరాలు రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. కప్పు అల్లం టీలో తేనె కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో రుతుక్రమం సమయంలో వచ్చే బాధ తగ్గుతుంది.
ఇదీ చదవండి: Ginger Peel Benefits: తొక్కే కదా అని పడేస్తున్నారా? అల్లం తొక్కతో..
Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్.. ఇలా ప్రయత్నించండి..
