HomeTelanganaCM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. డిసెంబర్‌ 7న ప్రమాణ స్వీకారం

CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. డిసెంబర్‌ 7న ప్రమాణ స్వీకారం

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగిందన్నారు. కాంగ్రెస్ కు విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. (CM Revanth Reddy)

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు

సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. హుటాహుటిన ఢిల్లీకి రేవంత్‌ రెడ్డి బయల్ధేరారు. ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు.

రేవంత్ రెడ్డి ప్రస్థానం..

* 1969 నవంబర్ 8న పుట్టిన రేవంత్ రెడ్డి
* ఏవీ కాలేజీలో బీఏ చేసిన రేవంత్
* విద్యార్థి దశలో ఏబీవీపీలో బాధ్యతలు
* జైపాల్ రెడ్డి బంధువుతో ప్రేమ వివాహం
* కొన్నాళ్లు ప్రింటింగ్ ప్రెస్ నడిపిన రేవంత్ రెడ్డి

* 2006 లో మిడ్జల్ మండల జడ్పిటిసీ గా విజయం
* 2007 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్సీ గా గెలుపు
* 2008 లో టీడీపీ లో చేరిన రేవంత్ రెడ్డి
* 2009 లో కొడంగల్ ఎమ్మెల్యే గా విజయం
* 2014 లో రెండోసారి కొడంగల్ నుంచి గెలుపు

* 2014 – 17 మధ్య టీడీపీ ఫ్లోర్ లీడర్
* 2017 లో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి
* 2018 లో కొడంగల్ నుంచి ఓటమి
* 2018 లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం
* 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపు

* 2021 జులై లో పూర్తిస్థాయి పీసీసీ చీఫ్ గా నియామకం
* 2023 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన రేవంత్
* స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లె.

ఇదీ చదవండి: Telangana Congress Victory: కాంగ్రెస్‌ గెలుపు వెనుక రహస్యాలు.. పదేళ్ల తర్వాత విజయం సాధ్యమైందిలా..

Congress win in Telangana: తెలంగాణ హస్తగతం.. CONG 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు