మన వంటింట్లో దొరికే అద్భుతమైన పదార్థాల్లో అల్లం (Ginger Peel Benefits) ఒకటి. అల్లం (Ginger Peel Benefits)అనేక కూరల్లో వాడుతుంటారు. అలాగే అల్లం టీ చాలా ఫేమస్. రోజూ అల్లం టీ తాగేవారు చాలా మంది ఉంటారు. అల్లం (Ginger Peel Benefits) తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని అనేక రకాలుగా వినియోగించవచ్చు. మరోవైపు కొందరు పచ్చి అల్లాన్ని ఉడికించి కొందరు తింటూ ఉంటారు.
దగ్గుతో బాధపడే వారికి ఇది ఒక ఉపశమనంగా పని చేస్తుంది. అల్లం తొక్కను ఉపయోగించి దగ్గును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం అల్లం తొక్క ఎండబెట్టి పొడి చేసుకోవాలి. బాగా దగ్గు ఇబ్బంది కలిగిస్తున్న సమయంలోఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు అల్లం తొక్కతో చేసిన టీ తాగడం వల్ల జలుబు నుంచి కూడా తక్షణం రిలీఫ్ పొందవచ్చు. అల్లం తొక్కతో పాటు లవంగాలు జోడించి టీని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.
అల్లం పొట్టు తీయకుండానే ఆహారంలో తీసుకోవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక తొక్క తీసివేసి వాడుతూ ఉంటారు. తొక్క తీయకుండా వినియోగిస్తే బోలెడు లాభాలు కలుగుతాయి. కానీ చాలా మంది మహిళలు ఇలా చేయడానికి ఇష్టపడరు. తొక్క తీసివేసి వంటల్లోనూ, టీ తయారు చేయడంలోనూ వినియోగిస్తూ ఉంటారు. అల్లం తొక్కతోనే బోలెడు ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అల్లం తొక్కలను తీసి పారవేసే బదులుగా ఎరువుగా వాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందులో భాస్వరం సైతం ఉంటుంది. దీని వల్ల మొక్కలు బాగా పెరగడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. మరోవైపు బ్యాక్టీరియాలను చంపే శక్తి కూడా అల్లానికి ఉంది. ఆహారంలో అల్లాన్ని ఇష్టపడని వారి కోసం అల్లం తొక్క వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుందని, ఇష్టంగా తింటారని చెబుతున్నారు.
సాధారణంగా అల్లం ఒక చిన్న మొక్క వేరు నుంచి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో ఎక్కువగా పండిస్తారు. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడని చెబుతారు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగంగా మారిపోయింది. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు.
ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది.
Read Also : 5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..