HomeLife StyleFood for winter: చలికాలంలో అద్భుత ఆహారాలు.. ఇవి ప్రయత్నించండి!

Food for winter: చలికాలంలో అద్భుత ఆహారాలు.. ఇవి ప్రయత్నించండి!

Food for winter: చలికాలం వచ్చేసింది. ప్రజలు తెల్లవారుజామున, ఉదయాన్నే బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఏపీలో తాజా మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో చలి మరింత పెరిగింది. మూడు రోజులపాటు అల్లాడించింది. ఇక చలికాలంలో సాధారణంగానే వేడి వేడిగా ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. చల్లారిన ఫుడ్‌ తీసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఏది తిన్నా వేడిగా ఆరగించాలని చూస్తుంటారు. ఈ కాలంలో ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. (Food for winter)

చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఫుడ్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆవాలు, క్యారెట్ పాయసం, వేరుశనగలు, పచ్చి కూరగాయలు లాంటివి అందరూ తినడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. వీటిని ఇష్టపడే వారికి చలికాలంలో ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నారు.

టర్నిప్‌ తీసుకోవడం వల్ల చలికాలంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా చలికాలంలో లభించే ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో జీవ క్రియను పెంచే లిపిడ్లు లభిస్తాయని ఆరోగ్య పండితులు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి, బరువు సమతూకంగా ఉంటాయట. రక్తపోటును తగ్గించడానికి, కళ్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది.

పచ్చి వెల్లుల్లి మంచిది

చలికాలంలో పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. దీన్ని స్ప్రింగ్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దీన్ని పూర్తిగా పెరగక ముందే భూమి నుంచి లాగేస్తారు. వింటర్‌లో దీన్ని ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జలుబు, దగ్గు, ఫ్లూ రాకుండా నివారిస్తుంది. మన బాడీలో వచ్చే వాపులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడాపెంచుతుంది. ఇంకా మొక్కల నుంచి లభించే గమ్‌ నుంచి తయారు చేసే లడ్డూలు తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

ఇదీ చదవండి: Cold Water Bath: చలికాలంలో చన్నీటి స్నానమే మేలు.. ఉపయోగాలు ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు