Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్‌ హావభావాలు.. వీడియో క్లిప్స్‌ వైరల్‌!

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్‌గా రెచ్చిపోతోంది. శృంగార సన్నివేశాల్లోనూ తాను అవలీలగా హావభావాలు ఇవ్వగలనని నిరూపించింది. తాజాగా తమన్నా నటించిన “జీ కర్దా”లోని సీన్లు కొన్ని సెగలు పుట్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో తమన్నా బిజీగా గడుపుతోంది. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమాయణం నడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లోనూ కాస్త గ్లామర్‌ డోసు పెంచేసింది. శృంగార భరిత సన్నివేశాల్లో నటిస్తూ యువతను ఆకర్షించే పనిలో పడింది మిల్కీ బ్యూటీ. (Tamannaah)

Image

1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించించింది తమన్నా భాటియా. (Tamannaah Bhatia) తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఒకే ఏడాది రెండు చిత్ర పరిశ్రమల్లో కథానాయికగా తెరంగేట్రం చేసి అందరి దృష్టిలో పడింది. అభిమానులు అప్పుడే ఆకర్షితులయ్యేలా చేసింది. సౌత్ హీరోయిన్ గా తమన్నా పేరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో హిందీలో అడుగు పెట్టింది తమన్నా. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులోకి రంగప్రవేశం చేసింది. ప్రస్తుతం ప్రేక్షకాదరణ పొందిన కథానాయికగా రాణిస్తోంది.

Image

అయితే, రొమాంటిక్‌ సన్నివేశాలు, శృంగారభరిత సీన్లలో తమన్నాను చూసిన అభిమానులకు వీనుల విందు దొరుకుతోంది. తాజాగా ఘాటు రొమాన్స్ చేస్తూ అందరికీ షాక్‌ ఇచ్చింది. మంచు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా చేసిన శ్రీ మూవీతో తమన్నాకు చాన్స్‌ లభించింది. తర్వాత హ్యాపీడేస్‌ సినిమాతో తెలుగులో పేరు వచ్చింది. అక్కడే తమన్నా కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. ఈ మూవీతో యూత్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌ సొంతం చేసుకుంది తమన్నా. తమన్నా పేరు అప్పట్లో మారుమోగిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

 Tamannaah Bhatia

ఇప్పటి వరకు తమన్నా 73 చిత్రాల్లోకి పైగా నటించి మెప్పించింది. కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, ఎఫ్‌2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో నటించింది. ఇప్పటికి 18 ఏళ్లయింది తమన్నా ఇండస్ట్రీకి వచ్చి.

తెలుగులో కూడా ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్, సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్, బోలే చూడియా, బాంద్రా సినిమాలతోపాటు లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అందులో ఏ రేంజ్‌లో హీటు పెంచుతుందోనని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఆమె నటించిన జీ కర్దా వెబ్‌ సిరీస్‌ ఈరోజే విడుదలైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా రిలీజ్‌ అయిన ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నా హాట్‌ అందాలతో రెచ్చిపోయింది. బోల్డ్‌ కంటెంట్‌తో అదరగొట్టింది. ఎన్నడూ చేయని విధంగా శృంగార సీన్లలో హొయలొలికించింది తమన్నా. అటు ట్రైలర్‌లోనూ హావభావాలు, నటనతో హాట్‌ టాపిక్‌గా మారిన తమన్నా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను షేక్‌ చేస్తోంది. జీకర్దా లోని సీన్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో తమన్నా టాప్‌లెస్‌గా కనిపిస్తోంది. సుహేల్‌ నాయర్‌తో బోట్‌లో వెళ్తున్న తమన్నా.. ఘాటు సన్నివేశంలో కనిపించింది.

Read Also : Tamannaah Bhatia: విజయ్‌ వర్మతో అందుకే చనువుగా ఉంటున్నా.. మిల్కీబ్యూటీ తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles