Dragon Fruit For Diabetes: డ్రాగన్ ఫ్రూట్‌తో డయాబెటిక్‌ను (Dragon Fruit For Diabetes) నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, డయాబెటిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు తీసుకొనే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శరీరంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా డయాబెటిక్ రోగుల్లో ఈ నియంత్రణ లేకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్‌లో (Dragon Fruit For Diabetes) అనేక రకాల పోషకాలుంటాయని. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ వీటిని తీసుకుంటే రక్తంలో సులభంగా చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల్లో ఈ పండులో 60 గ్రాముల ఆరోగ్యకరమైన కేలరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్, జీరో ఫ్యాట్, 13 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ లభిస్తాయని సూచిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ రోజూ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల్ని కూడా నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు.
శరీరంలో చక్కెర పరిమాణాలు నియంత్రించేందుకు క్రమం తప్పకుండా పలు రకాల పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా తీసుకోవాల్సిన పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఈ పండును రోజూ తినడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందించడమేకాకుండా మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తుందని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌ను ఎక్కువగా దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా దేశాల్లో వినియోగిస్తారట. ఇండియాలోనూ చాలా సంవత్సరాలుగా ఈ పంటను అనేక మంది రైతన్నలు పండిస్తున్నారు. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. సీజన్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ ఫ్రూట్‌ను తీసుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు.
కెరోటినాయిడ్స్ పుష్కలం..
డ్రాగన్ ఫ్రూట్ విటమిన్ సీ, అవసరమైన కెరోటినాయిడ్స్ ఈ ఫ్రూట్‌లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. ఈ జ్యూసీ ఫ్రూట్‌లో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, మీ తెల్ల రక్త కణాలను రక్షించడంలో సహాయపడే బీటాసైనిన్‌లు, బీటాక్శాంటిన్‌లు కూడా ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గౌట్, ఆర్థరైటిస్ వంటి తాపజనక పరిస్థితులను నయం చేయగలవు.
ఇక ఒలిగోశాకరైడ్స్ అని పిలిచే అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్‌తో నిండిన డ్రాగన్ ఫ్రూట్.. మన శరీరంలో లాక్టోబాసిల్లి, బిఫిడోబాక్టీరియా వంటి మంచి బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా పనిచేసేలా చేస్తుంది. మీ జీర్ణవ్యవస్థను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగు సంబంధిత అంటువ్యాధులు, మలబద్ధకం ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
Read Also : Good Health Tips: రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్య చిట్కాలివే..